Gangster Mukhtar Ansari: 32 ఏళ్ల నాటి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కోర్టు దోషిగా నిర్ధారించింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్సారీ 1991లో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు అవదేశ్ రాయ్ ను హత్య చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
మరో కేసులో జైలులో ఉన్న అన్సారీ.. ( Gangster Mukhtar Ansari)
ప్రస్తుతం ముఖ్తార్ అన్సారీ అనేక ఇతర క్రిమినల్ కేసులలో దోషిగా ఉన్నాడు.ముక్తార్ అన్సారీ ఇప్పటికే మరో కిడ్నాప్ మరియు హత్య కేసులో 10 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఏప్రిల్‌లో అతడికి శిక్ష పడింది.అవధేష్ రాయ్ 1991లో వారణాసిలో కాల్చి చంపబడ్డాడు. అవదేశ్ రాయ్ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ సోదరుడు. అన్సారీపై కేసు పెట్టింది అజయ్ రాయ్. ఆగష్టు 3, 1991న సాయుధ నేరస్థులు వ్యాన్ నంచి పలు మార్లు అతనిపై కాల్పులు జరిపారు.
కాల్పుల సమయంలో, అవదేశ్ రాయ్ తన సోదరుడు అజయ్ రాయ్‌తో పాటు నిలబడి ఉన్నాడు. ఈ కేసులో అజయ్ రాయ్ కూడా సాక్షిగా ఉన్నాడు. కోర్టులో కేసు నమోదవడంతో, ఈ కేసులో ప్రాథమిక “కేస్-డైరీ” మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది.