Ganga Vilas Luxury Cruise: ప్రపంచ పర్యాటకంలో భారతీయతను చాటే అతిపెద్ద క్రూయిజ్ ‘MV గంగా విలాస్ ’ఈ నెల 13 న ప్రారంభం కానుంది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా జెండా ఊపి ఈ టూర్ ను ప్రారంభిస్తారు. ఈ గంగా విలాస్ మొత్తం 27 నదుల గుండా ప్రయాణించి సరికొత్త పర్యాటకాన్ని అందించనుంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదీప్రయాణం గంగా విలాస్ యాత్రది. 51 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది. వారణాసిలో ప్రారంభమయ్యే టూర్ అస్సాంలోని దిబ్రుగఢ్ లో ముగియనుంది. లగ్జర క్రూయిజ్ టూర్ దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల మీదుగా సాగుతుంది.
ఈ లగ్జరీ క్రూయిజ్ 3200 కిలో మీటర్ల సదీర్ఘంగా ప్రయాణించనుంది. 5 రాష్ట్రాల్లోని 27 నదుల్లో ప్రయాణించే ఈ క్రూయిజ్ బంగ్లాదేశ్ నదీ ప్రవాహం ద్వారా అస్సాం చేరుకుంటుంది. ప్రయాణంలో 50 పైగా పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. అందులో ప్రపంచ వారసత్వ స్థలాలు, నేషనల్ పార్కులు, నదీ ఘాట్లతో పాటు పాట్నా, బీహార్, జార్ఘండ్ లోని సాహిబ్ గంజ్, వెస్ట్ బెంగాలోని కోల్ కతా, బంగ్లాదేశ్ లోని ధాకా , అస్సాంలోని దిబ్రూగడ్ కు చేరుతుంది. ఈ టూర్ లో వారణాసిలోని ప్రసిద్ధ గంగా హారతి నుంచి బౌద్ధమతానికి గొప్ప గౌరవప్రదమైన సారనాథ్ వరకు చూడవచ్చు. ప్రసిద్ధి చెందిన మయోంగ్, అస్సాంలోని అతిపెద్ద నదీ ద్వీపం, వైష్ణవ సాంస్కృతిక కేంద్రమైన మజులిని కూడా ఈ క్రూయిజ్కవర్ చేస్తుంది.
MV గంగా విలాస్ నౌక 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 1.4 మీటర్ల డ్రాఫ్ట్‌తో సౌకర్యవంతంగా ప్రయాణిస్తుంది. ఇందులో మూడు డెక్‌లు, 36 మంది పర్యాటకులు ప్రయాణించే సామర్థ్యంతో 18 సూట్ ఉంటాయి. పర్యాటకులకు విలాసవంతమైన టూర్ అనుభవాన్ని అందించడానికి గంగా విలాస్ అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. అదేవిధంగా మ్యూజిక్, కల్చరల్ ఈవెంట్స్ , జిమ్, స్పా, అబ్జర్వేటరీ లాంటీ ప్రత్యేక కార్యక్రమాలను ప్రయాణికులు ఆస్వాదించవచ్చు. నివేదికల ప్రకారం ఒక వ్యక్తికి సగటున రూ. 25,000( ఒక్క నైట్ కు మాత్రమే) అవుతుందని అంచనా. అంటే మొత్తం టూర్ కు దాదాపు రూ. 13 లక్షల అవుతుందని అంచనా. విలాస్ క్రూయిజ్ టికెట్లు ‘అంటారా లగ్జరీ రివర్ క్రూయిసెస్’వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచంలో ఇంతవరకు ఇలా రెండు పొడవైన నదులపై క్రూయిజ్ లో పర్యటన సందర్భాలు లేవని కేంద్ర పర్యాటక , సాంస్క్రతిక త, ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అందువల్లే తొలిసారిగా అత్యంత ఎక్కువ దూరాలకు గంగ, బ్రహ్మపుత్ర నదులపై కొనసాగే ఈ టూరపై ఆసక్తి నెలకొందని వివరించారు. గంగా విలాస్ క్రూయిజ్ ప్రాజెక్టు ద్వారా భారత్, బంగ్లాదేశ్ మధ్య సాంస్క్రతిక బంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పొచ్చన్నారు. దేశ పర్యాటరంగంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందన్నారు.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/