Site icon Prime9

Nitin Gadkari: పర్యావరణహిత ఇంధనం కోరుతూ గడ్కరీ పిలుపు

Nitin-Gadkari-tdc

Bengaluru: వాయి కాలుష్యాన్ని తగ్గించేలా ప్రపంచ వ్యాప్తంగా చేపడుతున్న పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశంలో పర్యావరణ హిత ఇంధనం పై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పిలుపు నిచ్చారు. జాతీయ రహదారుల నిర్మాణం పై తీసుకోవాల్సిన జాగ్రత్తల పై రాష్ట్రాల నుండి సమాచారం సేకరించేందుకు బెంగళూరులో జాతీయ స్ధాయిలో ఏర్పాటు చేసిన రెండు రోజుల “మంధన్” కార్యక్రమంలో ఆయన పలు సూచనలు చేసారు.

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఖచ్ఛితమైన సాంకేతిక పరిజ్నానాన్ని అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నించాలని ఇంజనీర్లకు సూచించారు. కో-ఆర్డినేషన్, కో-ఆపరేషన్, కమ్యునికేషన్ తో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో పలు రాష్ట్రాలకు చెందిన కీలక ప్రభుత్వ అధికారులు, పరిపాలనా నేతలు పాల్గొన్నారు.

Exit mobile version