Site icon Prime9

Earthquakes: జమ్మూకశ్మీర్‌, లడఖ్‌లో నాలుగు భూకంపాలు

earthquakes

earthquakes

 Earthquakes: నిమిషాల వ్యవధిలో సోమవారం నాలుగు భూకంపాలు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్‌ను కుదిపేశాయి. లడఖ్‌లోని కార్గిల్‌, జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్‌వార్‌లో ప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 3:48 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చాయి.

రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత..( Earthquakes)

లడఖ్‌లోని కార్గిల్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఎన్‌సిఎస్ చెప్పిన దాని ప్రకారం భూకంపం యొక్క కేంద్రం కార్గిల్. ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. లడఖ్‌లో మరో తేలికపాటి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది.ఈ నెల ప్రారంభంలో ఎనిమిది గంటల వ్యవధిలో లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో తేలికపాటి తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదైన మొదటి భూకంపం ఉదయం 8.25 గంటలకు సంభవించింది. దీని లోతు 35.44 డిగ్రీల అక్షాంశం మరియు 77.36 డిగ్రీల రేఖాంశంలో ఉపరితలం నుండి 10 కి.మీ.లోతులో ఉంది.35.23 అక్షాంశం మరియు 77.59 డిగ్రీల రేఖాంశం వద్ద ఉపరితలం నుండి 5 కి.మీ లోతులో సాయంత్రం 4.29 గంటలకు 3.7 తీవ్రతతో రెండవ భూకంపం నమోదయింది.

అక్టోబర్ మొదటవారంలో నేపాల్ లో గంట వ్యవధలో నాలుగు భూకంపాలు సంభవించాయి. మన దేశంలో ఢిల్లీ,ఘజియాబాద్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ప్రకంపనలు కూడా సంభవించాయి. దీనితో ఆయా ప్రాంతాల్లో నివాసితులు, ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు తీసారు.

Exit mobile version