Gopal Kanda: మాజీ ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్యకేసు.. మాజీ మంత్రి గోపాల్ కందాను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాను ఢిల్లీ కోర్టు మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది.ఆత్మహత్యకు ప్రేరేపించడం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం మరియు ఫోర్జరీ వంటి అన్ని ఆరోపణల నుండి గోపాల్ కందా మరియు అతని సహచరురాలు అరుణా చద్దాను ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధుల్ నిర్దోషులుగా ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 03:19 PM IST

 Gopal Kanda: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాను ఢిల్లీ కోర్టు మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది.ఆత్మహత్యకు ప్రేరేపించడం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం మరియు ఫోర్జరీ వంటి అన్ని ఆరోపణల నుండి గోపాల్ కందా మరియు అతని సహచరురాలు అరుణా చద్దాను ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధుల్ నిర్దోషులుగా ప్రకటించారు.

వేధింపుల కారణంగా ..( Gopal Kanda)

ఆగస్టు 4న తన సూసైడ్ నోట్‌లో, గోపాల్ కందా మరియు అరుణ చద్దా వేధింపుల కారణంగా తన జీవితాన్ని ముగించుకుంటున్నట్లు ఆమె పేర్కొంది.కూతురు చనిపోయిన ఆరు నెలలకే గీతిక శర్మ తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి పోలీసులు, కోర్టు విచారణల కారణంగా గుండెపోటు, వేధింపులే కారణమని కుటుంబీకులు ఆరోపించారు.గోపాల్ కందా (46), ప్రభావవంతమైన రాజకీయ నాయకుడు మరియు వ్యాపారవేత్త, హర్యానాలో గతంలో భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కేసు నమోదవడంతో ఆయన హోంశాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

అతను హర్యానా లోఖిత్ పార్టీ నాయకుడు. హర్యానాలోని సిర్సా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా ఉన్నారు.2019లో రాష్ట్రంలో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి గోపాల్ కందా బేషరతు మద్దతు ప్రకటించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీయే కూటమి పక్షాల సమావేశానికి కూడా ఆయనకు ఆహ్వానం అందింది.