CM Mohan Yadav: జనవరి 22న జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కోసం ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రం నుంచి ఐదు లక్షల లడ్డూలను అయోధ్యకు పంపనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శుక్రవారం తెలిపారు.స్వామి వివేకానంద దినోత్సవం సందర్బంగా ఒక పాఠశాలలో ఆయన మంత్రులతో కలిసి సూర్య నమస్కారాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ మొఘల్ చక్రవర్తి బాబర్ అయోధ్యలోని ఆలయాన్ని కూల్చివేశారని యాదవ్ అన్నారు. ఇప్పుడు దానిని పునర్నిర్మించారని, ఈ సందర్భాన్ని జరుపుకోవడంలో మధ్యప్రదేశ్ ఎలా వెనుకబడి ఉంటుందని ఆయన ప్రశ్నించారు.రామ మందిర దర్శనం కోసం ప్రజలను నిర్దిష్ట తేదీల్లో అయోధ్యకు పంపిస్తామని చెప్పారు. స్వామి వివేకానంద జీవితం స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా ఉన్న దేశం భారత్ కావడం మనకు విశేషం అని, వందేళ్ల క్రితం స్వామి వివేకానంద 21వ శతాబ్దం భారత్‌దేనని ప్రకటించారని ఆయన అన్నారు.భారతదేశం చంద్రయాన్ నుండి గగన్‌యాన్ వరకు అనేక మైలురాళ్లను మారుస్తోంది మరియు సాధిస్తోంది. ఆదిత్య L-1 అంతరిక్ష నౌక సూర్యుని అధ్యయనం చేయడానికి భారతదేశం యొక్క మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత మిషన్ అని యాదవ్ చెప్పారు.