Site icon Prime9

Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఎదురు కాల్పులు.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకరపోరు

Jammu and Kashmir

Jammu and Kashmir

Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. కుల్గామ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇండియాలో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత్ సైనం మట్టుబెట్టిన కొన్ని గంటలకే తంగ్‌మార్గ్ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో  ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’  కీలక కమాండర్ భద్రతా బలకాలకు చిక్కినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

మంగళవారం పహల్గాం ఘటనకు పాల్పడింది తామేనంటూ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు నేటి తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడేందుకు యత్నిస్తుండగా, వారిని సైన్యం కాల్చి చంపింది. ఎన్‌కౌంటర్ అనంతరం భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలు, పాకిస్థాన్ కరెన్సీ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Exit mobile version
Skip to toolbar