Site icon Prime9

FASTag: ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఫాస్ట్ ట్యాగ్ కలెక్షన్లు

FASTag

FASTag

FASTag: దేశంలో అన్ని టోల్ గేట్ల వద్ద ఒక్క రోజులో రికార్డు స్థాయిలో ఫాస్ట్ ట్యాగ్ కలెక్షన్లు వసూలయ్యాయి. ఏప్రిల్ 29 న ఒక్కరోజులోనే రూ. 193.15 కోట్లు వచ్చినట్టు కేంద్ర రహదారి, రవాణాశాఖ( National highways authority of India) తెలిపింది. ఆ రోజు 1.16 కోట్ల లావాదేవీల ద్వారా ఈ రికార్డు కలెక్షన్లు వచ్చినట్టు పేర్కొంది. ఫాస్ట్ ట్యాగ్ విధానం అమలు చేస్తున్న టోల్ ప్లాజాల సంఖ్య 770 నుంచి 1228 కి పెరిగినట్టు సంస్థ వెల్లడించింది. ఇందులో 339 రాష్ట్ర రహదారుల్లోని ప్లాజాలు ఉన్నాయి.

 

భవిష్యత్ లో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ(FASTag)

దాదాపు 6.9 కోట్ల ఫాస్ట్ ట్యాగ్ లను వినియోగదారులకు జారీ చేశారు. దీని వల్ల నేషనల్ హైవేల్లోని ప్లాజాల దగ్గర టోల్ ఫీజు చెల్లించే సమయం బాగా తగ్గి, రాకపోకలు సలుభతరమయ్యాయని తెలపింది. ఈ క్రమంలో వసూళ్లు కూడా పెరిగి రహదారి ఆస్తుల విలువను ఖచ్చితంగా అంచనా వేయడం వీలు పడిందని సంస్థ పేర్కొంది. కాగా, భవిష్యత్ లో టోల్ ప్లాజాల అవసరం లేకుండా ఫీజులు వసూలు చేసేందుకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రవాణాశాఖ తెలిపింది.

 

వాహనాల రద్దీని తగ్గించేందుకు

కాగా, కేంద్రం 2021 ఫిబ్రవరిలో ఫాస్ట్‌ట్యాగ్‌ విధానాన్ని తప్పనిసరి చేసింది. అంతేకాకుండా ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించని వాహనాల నుంచి ఎక్కువ టోల్‌ ఫీజులు వసూలు చేస్తోంది. అయితే , అప్పటి నుంచి ఒక్క రోజులో ఫాస్ట్ ట్యాగ్ విధానం ద్వారా ఇలా భారీ మొత్తంలో వసూళ్లు జరగడం తొలిసారి. టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఈ ఫాస్ట్‌ట్యాగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీతో ఫాస్ట్‌ ట్యాగ్‌ పని చేస్తుంది. వాహనదారుడి బ్యాంక్‌ అకౌంట్‌తో అది లింక్‌ చేయడం వల్ల ఆటోమెటిక్ గా టోల్‌ ఫీజు చెల్లింపు జరుగుతుంది. టోల్‌ ప్లాజాలతో పాటు ప్రస్తుతం 50కి పైగా నగరాల్లో 140 పార్కింగ్‌ ప్రాంతాల్లో ఫాస్ట్‌ట్యాగ్‌ ద్వారా పార్కింగ్‌ ఫీజు కూడా వసూలు చేస్తున్నట్లు జాతీయ రహదారుల సంస్థ తెలిపింది.

 

Exit mobile version
Skip to toolbar