Site icon Prime9

ఫ్యాక్ట్ చెక్: రూ.2000 నోట్లు రద్దు జనవరి 1 నుంచి అందుబాటులోకి రూ.1000 నోటు.. దీనిలో నిజమెంత?

fact check of 1000 minilans

fact check of 1000 minilans

Fact Check: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నోట్ల రద్దును చేసిన డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయనే చెప్పాలి. కాగా నోట్ల రద్దు అనంతరం రూ. 2000 నోటను ప్రభుత్వం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో నెట్టింట ఓ వార్త వైరల్ గా మారింది. రానున్న కొత్త సంవత్సరంలో రూ. 1000 నోటు వస్తుందని.. 2000 రూపాయల నోట్ల రద్దవుతాయంటూ ఎన్నో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. మరి వీటిపై ప్రభుత్వం ఏం చెప్తుందో ఓసారి చూసేద్దాం.

కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా మరోసారి రూ.1000 నోట్లను ప్రారంభించబోతోందని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఈ వెయ్యి రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేస్తుందని జనవరి 1 నుంచి 1000 రూపాయల కొత్త నోటు వస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే 2 వేల రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తున్నట్లు కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా క్లారిటీ ఇచ్చింది.
నోట్ల ముద్రన నిలిచిపోయిందే తప్ప.. రద్దు చేసే ఆలోచన లేదంటూ పేర్కొనింది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. జనవరి 1వ తేదీ నుంచి ఆర్బీఐ వెయ్యి రూపాయల నోటును విడుదల చేయనుందన్న వార్తలపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్‌ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పీఐబీ ఓ ట్వీట్‌ చేసింది. జనవరి 1 నుంచి కొత్త రూ.1000 నోట్లు రానున్నాయని, రూ.2000 నోట్లు రద్దు అవుతాయని వైరల్‌ అవుతున్న వార్తలు నిజాలు కావని, ఇలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ని, ఎవ్వరు కూడా నమ్మవద్దని సూచించింది.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఇలాంటి పోస్టులు పూర్తిగా అవాస్తవమని పీఐబీ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ అలాంటి ప్లాన్ ఏమీ చేయలేదని, అలాగే 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునే ప్రణాళిక కూడా ఏమీ లేదని స్పష్టం చేసింది. అలాంటి పోస్ట్‌లను షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇలా వైరల్ వార్తలను ప్రజలు తనిఖీ కూడా చేయవచ్చని దీని కోసం మీరు అధికారిక లింక్ https://factcheck.pib.gov.in/ సందర్శించాలి. ఇది కాకుండా మీరు వాట్సాప్ నంబర్ +918799711259 లేదా ఇమెయిల్: pibfactcheck@gmail.com కి కూడా వీడియోను పంపవచ్చు. దీనిపై తనిఖీ నిర్వహించి వెంటనే క్లారిటీ ఇస్తామని పీఐబీ తెలిపింది.

 

Exit mobile version