Site icon Prime9

NewsClick FIR: న్యూస్ క్లిక్ ఎఫ్ఐఆర్ : భారత్ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడానికి కోట్లాదిరూపాయల విదేశీ నిధులు

NewsClick

NewsClick

NewsClick FIR: ఆన్‌లైన్ పోర్టల్ న్యూస్‌క్లిక్ అక్రమ నిధుల కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో, భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడానికి మరియు దేశంపై అసంతృప్తిని కలిగించడానికి చైనా నుండి పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయని పేర్కొన్నారు.

ఉద్దేశపూర్వకంగా జమ్మూ కాశ్మీర్, మరియు అరుణాచల్ ప్రదేశ్ గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేయడం కోసం చెల్లింపు వార్తలకోసం కోట్లాది రూపాయల విదేశీ నిధులను ఉపయోగించారని ఎఫ్‌ఐఆర్‌ తెలిపిందిషియోమీ, వివో వంటి పెద్ద చైనీస్ టెలికాం కంపెనీలు భారత్‌లో అక్రమంగా విదేశీ నిధులను చొప్పించినందుకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించి వేలాది షెల్ కంపెనీలను భారతదేశంలో చేర్చుకున్నాయని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు మరియు ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, కార్యకర్త నెవిల్లే రాయ్ సింఘం మరియు రచయిత్రి గీతా హరిహరన్ ఈ చైనీస్ టెలికాం కంపెనీల ప్రయోజనాల కోసం భారతదేశంలో ఒక చట్టపరమైన కమ్యూనిటీ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి కుట్ర పన్నారు. .కేంద్ర ప్రభుత్వంపై బూటకపు కథనాన్ని ప్రచారం చేసేందుకు చైనా నుంచి న్యూస్‌క్లిక్‌కు నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద నమోదైన కేసులో పుర్కాయస్థ, మానవ వనరుల విభాగం అధిపతి అమిత్ చక్రవర్తి మంగళవారం అరెస్ట్ అయ్యారు.

ఎఫ్ఐఆర్ లో ఆరోపణలు ఇవే..(NewsClick FIR)

భారత ఆర్థిక వ్యవస్థకు అనేక వందల కోట్ల నష్టం కలిగించే లక్ష్యంతో భారతీయ సంస్థలు మరియు విదేశీ సంస్థలు రైతుల నిరసనకు మద్దతు ఇవ్వడానికి మరియు నిధులు సమకూర్చడానికి కుట్ర పన్నాయి. నిందితులు కేంద్ర ప్రభుత్వ కోవిడ్-19 మేనేజ్‌మెంట్ ప్రయత్నాలను కించపరచడానికి తప్పుడు కథనాలను ప్రచారం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలను విధ్వంసం చేయడానికి కుట్ర పన్నారు. ఏప్రిల్ 2018 నుండి అక్రమ మార్గాల ద్వారా కోట్లాది రూపాయల విదేశీ నిధులు న్యూస్ క్లిక్ కి అందాయి.ఎఫ్‌ఐఆర్‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీల సభ్యుడుగా అభివర్ణించిన నెవిల్లే రాయ్ సింఘం ఈ నిధులను మోసపూరితంగా పొందారు.న్యూస్‌క్లిక్‌లో వాటాదారు అయిన గౌతమ్ నవ్‌లాఖా – భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాలుపంచుకున్నారని మరియు నిషేధిత నక్సల్ సంస్థలకు చురుకుగా మద్దతు ఇస్తున్నారు. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కి చెందిన గూఢచారి సంస్దతో కూడా సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు.జమ్మూ కాశ్మీర్ మరియు అరుణాచల్ ప్రదేశ్‌లను వివాదాస్పద ప్రాంతాలుగా చూపించే ఉద్దేశ్యంతో న్యూస్ క్లిక్ ఉద్యోగులు మరియు యజమానులు చైనాలోని వ్యక్తులతో ఇమెయిల్‌లను పంచుకున్నారు.ఈ అక్రమంగా తరలించబడిన విదేశీ నిధులను ప్రబీర్ పుర్కాయస్థ మరియు అతని సహచరులు జోసెఫ్ రాజ్, అనూప్ చక్రవర్తి (అమిత్ చక్రవర్తి సోదరుడు), బప్పాదిత్య సిన్హా (వర్టునెట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్) ద్వారా స్వాహా చేశారని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.ఈ నిధులను గౌతమ్ నవ్లాఖా, తీస్తా సీతల్వాద్ సహచరులు జావేద్ ఆనంద్, తమరా, జిబ్రాన్, ఊర్మిళేష్, ఆరాత్రిక హల్దర్, పరంజోయ్ గుహా ఠాకుర్తా, త్రినా శంకర్, అభిసర్ శర్మలకు పంపిణీ చేసినట్లు కూడా తెలిసిందని ఎఫ్ఐఆర్ ఆరోపించింది.

Exit mobile version