Jharkhand Encounter: సోమవారం జార్ఖండ్‌లోని ఛత్రాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఇద్దరు మావోయిస్టులపై రూ.25 లక్షలు చొప్పున ప్రభుత్వం రివార్డులు ప్రకటించింది. ఈ సందర్బంగా 2 ఏకే 47 స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది అంటూ జార్ఖండ్ పోలీసులు తెలిపారు.
ఒక ఆపరేషన్ సందర్బంగా ఐదుగురు మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. కొంత అధునాతన మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని జార్ఖండ్ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (ADG) (ఆపరేషన్స్) సంజయ్ లట్కర్ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ముగ్గురు నక్సల్స్‌ను ఆదివారం తెల్లవారుజామున పోలీసులు మరియు DRG సంయుక్త బృందం అరెస్టు చేసింది. అరెస్టయిన నక్సల్స్‌ను సుమన్‌సింగ్ అంచాల (42), సంజయ్ కుమార్ ఉసెండి (27), పరస్రామ్ దంగూల్ (55)గా గుర్తించారు.నక్సల్స్ ఉన్నారనే పక్కా సమాచారంతో జాయింట్ టీమ్ ఆపరేషన్ ప్రారంభించి కోయెలిబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో ముగ్గురు తిరుగుబాటుదారులను అదుపులోకి తీసుకోవడంలో సఫలమయ్యామని అంటఘర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) ఖోమన్ సిన్హా తెలిపారు. నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న వాహనాలను తగులబెట్టడం, టవర్లకు నిప్పు పెట్టడం, పోలీసు ఇన్‌ఫార్మర్లుగా ముద్రవేసి వ్యక్తులపై దాడి చేయడం వంటి అనేక ఘటనల్లో ఈ నక్సల్స్ పాలుపంచుకున్నారని సిన్హా తెలిపారు.