Site icon Prime9

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. 22 మంది మావోయిస్టులు మృతి

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు ఎదురెదురుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గంగలూరు పరిధి ఆండ్రి అడవుల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

 

వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో బీజాపూర్, కాంకెర్ జిల్లాల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టుు మరణించగా.. ఓ జవాన్ కూడ అమరుడు అయినట్లు తెలుస్తోంది. బీజాపూర్, దంతెవాడ జిల్లాలోని సమీపంలో గంగలూరు పరిధి అండ్రి అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో రెండు జిల్లాల నుంచి భద్రతా దళాలు సంయుక్తంగా అడవిలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.

 

ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. మొత్తం 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ వద్ద జరిగిన కాల్పుల్లో 18 మంది మావోయిస్టుల మృతదేహాలు ఆచూకీ గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. కాగా బీజాపూర్ దగ్గర జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ అమరుడయ్యాడు.

 

అలాగే, కాంకెర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో డీఆర్‌జీ, బీఎస్ఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. కాగా, రెండు ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది.

 

Exit mobile version
Skip to toolbar