Site icon Prime9

Emergency Alert: దేశ వ్యాప్తంగా మొబైల్ స్క్రీన్‌లపై ఎమర్జెన్సీ అలర్ట్

Emergency Alert

Emergency Alert

Emergency Alert:దేశవ్యాప్తంగా కొంతమంది మొబైల్‌ యూజర్లకు ఓ ఎమర్జెన్సీ అలర్ట్‌ సందేశం వచ్చింది. దీంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలియక వినియోగదారులు గందరగోళానికి గురయ్యారు. టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్, పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్‌ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో ప్రజల మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్‌ప్లే అయింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తరపును ఈ టెస్టింగ్ జరిగింది. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల నుంచి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ఈ ట్రయల్ టెస్ట్ నిర్వహించారు.

మంత్రి కేటీఆర్ కు కూడా..(Emergency Alert)

ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి ఎందుకంటే మీ వైపు నుండి ఎటువంటి చర్య అవసరం లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అమలు చేస్తున్న పాన్-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించడానికి ఈ సందేశం పంపబడింది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడం మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది అని ఫ్లాష్ సందేశంలో ఉంది. అవసరమైన ఎమర్జెన్సీ సమాచారం సకాలంలో గరిష్ట ప్రజలకు చేరేలా అలర్ట్ సిస్టమ్ నిర్ధారిస్తుంది అని ప్రభుత్వం తెలిపింది. సంభావ్య బెదిరింపుల గురించి ప్రజలకు తెలియజేయడానికి మరియు వారికి తెలియజేయడానికి ప్రభుత్వ సంస్థలు మరియు అత్యవసర సేవల ద్వారా ఇది ఉపయోగించబడుతుంది.మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో ఉండగా ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. దీనితో ఒక్కసారిగా కేటీఆర్ భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదం ఏమైనా జరిగిందా అని ప్రశ్నించారు. క్లోజ్‌డ్ ఆడిటోరియం కాబట్టి అందరికి గుడ్ లక్ అంటూ కేటీఆర్ ప్రసంగాన్ని కొనసాగించారు.

Exit mobile version