Elon Musk: ట్విటర్ ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో నిర్ణయంతో అందరికీ షాక్ ఇచ్చారు.
ఖర్చులు తగ్గించుకునే పనిలో పలు నిర్ణయాలు తీసుకుంటున్న మస్క్ ఇప్పుడు భారత్ లో ఉన్న మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేస్తున్నట్టు ప్రకటించారు.
ఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆఫీసులను మూసివేసి.. అక్కడి సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయమని చెప్పినట్టు సమాచారం.
అయితే బెంగళూరు కార్యాలయంలో మాత్రం కంపెనీ తన సేవలను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.
కొనుగోలు నుంచి సంచలనాలే(Elon Musk)
గత ఏడాది అక్టోబర్ లో ఎలాన్ మస్క్ ట్విటర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆదాయం భారీగా పడిపోయింది.
దీంతో ఆర్థిక కష్టాలను తగ్గించుకోవడానికి ఎలాన్ మస్క్ అనేక చర్యలు చేపట్టారు. ట్విటర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ ప్రారంభించారు. ఉద్చోగులకు ఇచ్చే సౌకర్యాలు, వసతులూ కుదించారు.
విలువైన వస్తువులనూ వేలం వేశారు. దాదాపు 90 శాతం ఉద్యోగులను తగ్గించారు. గత ఏడాది భారత్ ట్విటర్ లోని 200 మంది సిబ్బందిలో 90 శాతం మందిని తొలిగించారు.
భారీ తొలగింపుల తర్వాత ఇప్పుడు కార్యాలయాలు మూసివేయడం చర్చనీయాంశంగా మారింది.
ట్విటర్ సీఈఓ గా కుక్క
రెండు రోజుల క్రితం ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ కొత్త సీఈవో అంటూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్క ఫోల్కి ఫోటోను పోస్ట్ చేసి ‘న్యూ సీఈఓ ఆఫ్ ట్విటర్’ అని పేర్కొనడం విశేషం.
అంతేకాదు ఇతర సీఈవోల కన్నా ఇదే బెటర్ , నెంబర్లలోనూ ఇదే బెటర్. స్టయిల్ కూడా అదిరింది అంటూ పరోక్షంగా మాజీ సీఈవో అగర్వాల్‌ను అవమానించేలా వరుస ట్విట్లలో కామెంట్ చేశాడు.
స్టయిలిష్‌గా, బ్రాండెడ్ బ్లాక్ టీ-షర్ట్‌లో క్రేజీ లుక్స్‌తో ఉన్న ఫ్లోకి ముందు ఓ టేబుల్, దానిపైన ల్యాప్‌టాప్ ఉన్న ఫోటోను షేర్ చేయడంతో..
కొత్త సీఈవో స్టైల్ అదిరిపోయిందని ఒకరు, చాలా ఇన్‌స్పైరింగ్.. పప్పీలా ఆ స్థాయికి ఎదగాలనుకుంటున్నా అంటూ కామెంట్లు పెట్టారు.
కాగా అంతకుముందు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్‌లో అభ్యంతరకరమైన పోస్ట్ చేయడంతో మస్క్‌పై యూజర్లు మండిపడ్డారు. చాలామంది బ్లాక్‌మస్క్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు.