Shiv Sena: ఎన్నికల కమిషన్ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు గట్టి షాక్ ఇచ్చింది. ఏక్‌నాథ్ షిండే వర్గానికే అధికారిక శివసేన పేరుతో పాటు పార్టీ చిహ్నం దక్కుతుందని తేల్చి చెప్పింది. ఉద్దవ్ ఠాక్రే తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన పార్టీకి అసలు వారసులు ఎవరైనా దానిపై ఇప్పటి వరకు ఉద్దవ్ వర్గం, షిండే వర్గం మధ్య వివాదం నెలకొంది.
శివసేన నుంచి వేరుపడ్డ షిండే వర్గం అసలైన శివసేన తమదేనని వాదించింది. షిండే వర్గం బీజేపీ చేతులు కలిపి మహారాష్ర్టలో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. పార్టీ చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ ముందు వాద ప్రతివాదనల తర్వాతఎన్నికల కమిషన్ చివరకు షిండకే పార్టీ చిహ్నంతో పాటు హక్కలు అప్పగించింది.
శివసేన ప్రస్తుత రాజ్యాంగం అప్రజాస్వామికం..(Shiv Sena)
శివసేన ప్రస్తుత రాజ్యాంగం అప్రజాస్వామికమని ఈసీ పేర్కొంది. 2018లో సవరించిన సేన రాజ్యాంగం పోల్ ప్యానెల్ రికార్డులో లేదని పేర్కొంది.2018లో సవరించిన శివసేన రాజ్యాంగం ఎన్నికలసంఘానికి ఇవ్వబడలేదు. కమిషన్ ఒత్తిడితో దివంగత బాలాసాహెబ్ థాకరే తీసుకువచ్చిన 1999 పార్టీ రాజ్యాంగంలో ప్రజాస్వామ్య నిబంధనలను ప్రవేశపెట్టే చర్యను సవరణలు రద్దు చేశాయని ఎన్నికల సంఘం తెలిపింది.1999లో ఎన్నికలసంఘం ఆమోదించని శివసేన రాజ్యాంగం యొక్క అప్రజాస్వామిక నిబంధనలను ఒక రహస్య పద్ధతిలో తిరిగి తీసుకురావడం ద్వారా పార్టీని మరింత ద్వేషపూరితంగా మార్చిందని ఎన్నికల సంఘం గమనించింది78 పేజీల ఆర్డర్‌లో, రాష్ట్రంలో అసెంబ్లీ ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు థాకరే వర్గానికి కేటాయించిన “ఫ్లేమింగ్ టార్చ్” పోల్ గుర్తును ఉంచుకోవడానికి కమిషన్ అనుమతించింది.
షిండే గ్రూపు ఎమ్మెల్యేలకే ఎక్కువ ఓట్లు.. (Shiv Sena)
2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 55 మంది శివసేన అభ్యర్థులకు అనుకూలంగా పోలైన ఓట్లలో ఏక్‌నాథ్ షిండేకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు దాదాపు 76 శాతం ఓట్లు పొందారని కమిషన్ పేర్కొంది.ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గెలిచిన శివసేన అభ్యర్థులకు అనుకూలంగా పోలైన ఓట్లలో 23.5 శాతం వచ్చాయని ముగ్గురు సభ్యుల కమిషన్ ఏకగ్రీవంగా ఉత్తర్వులు జారీ చేసింది.