Site icon Prime9

Bank Fraud Case: బ్యాంకు మోసం కేసు: రూ.315 కోట్ల విలువైన ఎన్‌సిపి నేత ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

Bank Fraud Case

Bank Fraud Case

Bank Fraud Case: మనీలాండరింగ్ కేసులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపి ఈశ్వర్‌లాల్ జైన్‌కు సంబంధించిన పలు ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తాత్కాలికంగా అటాచ్ చేసింది.ఎన్సీపీ మాజీ కోశాధికారిగా కూడా పనిచేసిన ఈశ్వర్‌లాల్ జైన్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుడు.

బ్యాంకుకు రూ. 352 కోట్ల నష్టం..(Bank Fraud Case)

మహారాష్ట్రలోని జలగావ్, ముంబై, థానే, సిల్లోడ్, గుజరాత్‌లోని కచ్‌తో సహా వివిధ ప్రాంతాల్లో 70 స్థిరాస్తులను అటాచ్ చేశారు.ఆస్తులతో పాటు వెండి, వజ్రాల ఆభరణాలతో పాటు కరెన్సీని కూడా దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. ఈ ఆస్తుల విలువ రూ.315.60 కోట్లుగా అధికారులు తెలిపారు.అటాచ్ చేసిన చర, స్థిరాస్తుల్లో ఈశ్వర్‌లాల్ జైన్, ఆయన కుమారుడు మనీష్ జైన్ మరియు ఇతరులు సంపాదించిన బినామీ ఆస్తులు ఉన్నాయి. ఈశ్వర్‌లాల్ జైన్ మరియు ఇతరులతో సంబంధం ఉన్న ఆభరణాల కంపెనీలపై 2022లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నమోదు చేసిన బ్యాంకు మోసం ఎఫ్ఐఆర్ ఆధారంగా జైన్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా తమ దర్యాప్తులో జైన్ మరియు ఆభరణాల కంపెనీల ఇతర ప్రమోటర్లు నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ మరియు నేరపూరిత దుష్ప్రవర్తన వంటి నేరాలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. నిందితులు బ్యాంకు నుండి గణనీయమైన రుణాలను పొందేందుకు నకిలీ ఆర్థిక రికార్డులను సమర్పించి, డబ్బును స్వాహా చేశారని ఈడీ పేర్కొంది. దీనివలన బ్యాంకుకు రూ. 352.49 కోట్ల కంటే ఎక్కువ నష్టం వాటిల్లింది.

 

Exit mobile version