Site icon Prime9

Foreign Minister Jaishankar: ఉగ్రవాదానికి నిధులు సమకూర్చవద్దు.. షాంఘై సమావేశంలో భార‌త విదేశాంగ మంత్రి జైశంకర్

Jaishankar

Jaishankar

Foreign Minister Jaishankar: ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం ముప్పుగా ప‌రిణ‌మించిందని భార‌త విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళ‌న వ్యక్తంచేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలని షాంఘై స‌హ‌కార సంస్థ విదేశాంగ మంత్రుల సమక్షంలో సూచించారు. స‌మావేశంలో పాల్గొన్న పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ స‌మ‌క్షంలోనే దాయాదిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని ఎస్సీవో సభ్య దేశాలకు చెప్పారు జై శంకర్‌.

గోవాలో రెండో రోజు షాంఘై స‌హ‌కార సంస్థ విదేశాంగ మంత్రుల మండలి సమావేశం భారత్ అధ్యక్షత‌నజరిగింది. ఈ స‌మావేశానికి పాక్‌ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టోతో పాటు చైనా విదేశాంగ మంత్రి క్వింగ్‌ గాంగ్‌, రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్‌ పాల్గొన్నారు. వీరితో పాటు తజకిస్థాన్‌, కిర్జికిస్థాన్‌, కజకిస్థాన్‌ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఇందులో ఇంగ్లీషును ఎస్సీవో మూడో అధికారిక భాషగా గుర్తించాలని సభ్య దేశాలను జైశంకర్‌ కోరారు. రష్యన్‌, మాండరిన్‌లు అధికారికంగా ఉన్న క్రమంలో ఆంగ్లాన్నీ అధికారిక భాషగా చేర్చాలన్నారు. ఎస్సీవోలో సంస్కరణలు, ఆధునీకరణపై చర్చ ప్రారంభమైందని చెప్పడానికి సంతోషిస్తున్నానని అంటూనే.. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌ని జైశంకర్ ఈ వేదికపై మ‌రోసారి స్పష్టంచేశారు.

షేక్ హ్యాండ్ లేదు.. నమస్తే మాత్రమే..(Foreign Minister Jaishankar)

ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల మండలి సమావేశానికి హాజరైన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీని జై శంకర్.. షేక్​ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం చేసి స్వాగతం పలికారు. గ‌డిచిన 12 ఏళ్లలో భార‌త్‌ను సంద‌ర్భించిన మొట్టమొద‌టి పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా బిలావల్ భుట్టో జర్దారీ గుర్తింపు పొందారు. జమ్మూ కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదంతో సహా అనేక సమస్యలపై రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొనసాగుతున్న ఒత్తిడి మధ్య పాక్ మంత్రి భారత్‌లో ప‌ర్యటిస్తున్నారు. రష్యా, చైనా కూడా సభ్యులుగా ఉన్న ఈ ప్రత్యేక సమూహం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని పశ్చిమ దేశాలు నిశితంగా గమనిస్తున్నప్పటికీ… ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రతా పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో ఎస్‌సీఓ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ రెండు అంశాలు అధికారిక ఎజెండాలో లేవు. అయితే, సభ్య దేశాలు తమ జాతీయ ప్రకటనలలో భాగంగా ఈ సమస్యలను లేవనెత్తే అవకాశముంది.

అది చరిత్ర.. మేల్కొని కాఫీ తాగండి..

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అంశం న్యూ ఢిల్లీ మరియు ఇస్లామాబాద్ మధ్య పతనానికి కారణం అని నిందించినందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి కౌంటర్ ఇచ్చారు. గోవాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశం ముగిసిన తర్వాత జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టికల్ 370 చరిత్ర. మేల్కొని కాఫీ తాగండి అని అన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన బిలావల్‌ కొన్ని ప్రతిపాదనలు చేశారు. అయితే ఈ ప్రతిపాదనలను భారత్‌ నిర్ద్వదందంగా తిరస్కరించింది. భారత్‌ – పాకిస్తాన్‌ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడానికి రష్యా, చైనాలు మధ్యవర్తిత్వవ వహించాలని బిలావల్‌ కోరడంతో.. ఈ ప్రతిపాదనను భారత్‌ నిరాకరించింది.

Exit mobile version
Skip to toolbar