Tamil Nadu Governor Ravi: తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తన కుమార్తె వివాహాన్ని ఊటీలో నిర్వహించిన 18 నెలల తర్వాత, వేడుకలకు నిధుల వినియోగంపై వివాదం చెలరేగింది.బుధవారం, డిఎంకె ఎంపి దయానిధి మారన్, గత ఏడాది ఫిబ్రవరిలో ఊటీ రాజ్‌భవన్‌లో రవి కుటుంబ వేడుక కోసం ప్రభుత్వ డబ్బును ఉపయోగించారని ఆరోపించారు.
దీనిని రాజ్‌భవన్ ఖండించింది. గవర్నర్ రవి ఈ వివాహానికి ప్రభుత్వ నిధులను వాడుకోలేదని తన వ్యక్తిగత నిధులను వినియోగించారని తెలిపింది. గవర్నర్ అతిథులందరికీ ప్రైవేట్ హోటళ్లలో బస చేశారు. రాజ్‌భవన్‌లో ఎవరినీ ఉంచలేదు. అతిథులు మాత్రమే కాకుండా గవర్నర్ కుటుంబ సభ్యుల కోసం కూడా ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకున్నారు. ప్రభుత్వ వాహనానాలను అస్సలు ఉపయోగించలేదని రాజ్ భవన్ తెలిపింది. మొత్తం ఈవెంట్ కోసం బయటివారిని తెచ్చుకున్నారు.. రాజ్ భవన్ సిబ్బందిని ఉపయోగించలేదు. అతిథులకు బోర్డింగ్ మరియు లాడ్జింగ్, వాహనాల అద్దె ఛార్జీలు, టీ మరియు కాఫీతో సహా క్యాటరింగ్, లైటింగ్, పువ్వులు మరియు పూల అలంకరణలు, సేవా సిబ్బంది మొదలైన వాటితో సహా మొత్తం ఖర్చును గవర్నర్ భరించారని పేర్కొంది. గవర్నర్‌పై ఎంపీ ఆరోపణలు బాధ్యతారాహిత్యంగా రాజ్ భవన్ పేర్కొంది.