Prime9

DGCA Alert: విండోషేడ్స్ తెరవొద్దు.. డీజీసీఏ కీలక ఆదేశాలు

DGCA Issued alerts to all Commercial Flights Commercial Flights:దేశంలో కమర్షియల్ ఫ్లైట్స్ కు డీజీసీఏ కీలక సూచన చేసింది. రక్షణశాఖకు చెందిన ఎయిర్ బేస్ లో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే సమయంలో విండో షేడ్స్ ను మూసివేయాలని ఆదేశించింది. ముఖ్యంగా పాకిస్తాన్ తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత స్థావరాల వద్ద ఈ సూచన తప్పక పాటించాలని పేర్కొంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 10 వేల అడుగుల ఎత్తు వెళ్లే వరకు ల్యాండింగ్ సమయంలో ఈ ఎత్తుకు దిగిన తర్వాత నిబంధనను పాటించాలని సూచించింది. ఎమర్జెన్సీ విండ్ వద్ద నిబంధన వర్తించదని తెలిపింది.

కాగా భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్నాయి. జమ్ముకాశ్మీర్ లోని పహల్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మంది ఉగ్రవాదులను పొట్టన బెట్టుకున్నారు. ఉగ్రదాడికి సమాధానంగా భారత్ ఆర్మీ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దాడుల్లో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు. దీంతో పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్ పైకి దాడులకు దిగింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. మరోవైపు పాకిస్తాన్ లోని ఆర్మీ స్థావరాలు, ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసింది. దీంతో కాల్పుల విరమణ అంటూ పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది.

 

కానీ భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ ఇచ్చిన ఆదేశాలతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆదేవిధంగా సైనిక స్థావరాల వద్ద ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఉన్న నిషేధం గురించి ప్రయాణికులను అప్రమత్తం చేయాలని డీజీసీఏ ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఏదుర్కోవలసి వస్తుందని తెలిపింది. ముఖ్యంగా లేహ్, జమ్ము, శ్రీనగర్, ఆదంపూర్, పఠాన్ కోట్, చండీగఢ్, బఠిండా, జైసల్మేర్, నాల్, జోధ్ పూర్, హిండన్, ఆగ్రా, కాన్పూర్, బరేలీ, మహారాజ్ పూర్, గోరఖ్ పూర్, భుజ్, లొహెగావ్, డాబోలిమ్ (గోవా), వైజాగ్ విమానాశ్రయాలు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని తెలిపింది.

Exit mobile version
Skip to toolbar