Prime9

Indigo Flight Damage: విమానంలో భారీ కుదుపు.. దెబ్బతిన్న ముందుభాగం

Delhi – Srinagar Indigo Flight Damaged in Hailstorm: ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు వెళ్తున్న విమానం భారీ కుదుపులకు లోనైంది. వడగళ్లతో కూడిన భారీ వర్షానికి విమానం ముందుబాగం దెబ్బతిన్నది. పైలెట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అరుపులు కేకలు పెట్టారు. నార్త్ ఇండియాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వడగండ్ల వాన కురిసింది. వడగండ్ల తీవ్రతకు విమానం ముందుబాగం తీవ్రంగా దెబ్బతిన్నది.   ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు వెళ్తున్న ఇండిగో విమానానికి జరిగింది. పైలెట్ విమానాన్ని చాకచక్యంతో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

 

 

ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరిన ఇండిగో 6E2142 విమానానికి గురువారం వాతావరణం సహకరించలేదు. తీవ్రమైన గాలులు, వడగండ్ల మధ్య విమానం చిక్కుకుంది. దీంతో పైలట్ ఎమర్సెన్సీని ప్రకటించడంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకున్నారు. అరుపులు కేకలు వేస్తూ సీట్లను గట్టిగా పట్టకున్నారు. శ్రీనగర్ ఏటీసీకి పైలట్ సమాచారం ఇవ్వడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు పర్మిషన్ ఇచ్చారు. ఎట్టకేలకు విమానం ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో విమానం ముందుబాగం దెబ్బతింది.

 

Exit mobile version
Skip to toolbar