Female wrestlers: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు ఆధారాలుగా ఫొటోలు, ఆడియో, వీడియోలను అందించాలని ఢిల్లీ పోలీసులు ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరినట్లు సమాచారం.
కెమెరాను క్లిక్ చేయడానికి సిద్దంగా ఉండాలి..(Female wrestlers)
ఢిల్లీ పోలీసుల వైఖరిపై కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మండిపడ్డారు. ఇప్పుడు బాధితులు కెమెరాను క్లిక్ చేయడానికి సిద్ధంగా ఉండాలని, వారు ఎదుర్కొన్న దాడిని రికార్డ్ చేయడానికిసిద్ధంగా ఉండాలని అన్నారు.బ్రిజ్ భూషణ్ దర్యాప్తు లోపోలీసులు వీడియో, ఆడియో, కాల్ రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్‌లను రుజువుగా కోరుకుంటున్నారు. ఇప్పుడు బాధితులు కెమెరా ను క్లిక్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. దాడిని రికార్డ్ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉండాలి.అందుకు బాధితులకు నోటీసు ఇచ్చిన తర్వాత దాడులు జరగాలి అంటూ సిబల్ ట్వీట్ చేసారు.
గత నెలలో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో మహిళా రెజ్లర్ల ఫిర్యాదుపై రెండు ప్రథమ సమాచార నివేదికలు నమోదు చేయబడ్డాయి. ఆరుగురు రెజ్లర్ల ఫిర్యాదులను కలిపి ఒక ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయగా, మైనర్ తండ్రి ఫిర్యాదు ఆధారంగా విడిగా ఒకటి నమోదు చేయబడింది.