Site icon Prime9

Satyendra Jain: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కు జైలులో బాడీ మసాజ్, విలాసవంతమైన జీవితం.. ఈడీ ఆరోపణ

Jain

Jain

New Delhi: మనీలాండరింగ్ కేసులో మే నెలలో అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ జైలులో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదివారం ప్రత్యేక కోర్టుకు తెలిపింది. దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నంలో సహ నిందితులను క్రమం తప్పకుండా కలుస్తున్నారని జైన్ తీహార్ జైలులో బాడీ మసాజ్‌తో సహా అన్ని సౌకర్యాలను పొందుతున్నారని, మంత్రి పదవిని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది.

ఈడీ తన అఫిడవిట్‌తో పాటు తన వాదనలకు మద్దతుగా సీసీటీవీ ఫుటేజీని సమర్పించింది. జైన్ భార్య పూనమ్ జైన్‌కు కూడా అతని జైలు గదికి ప్రవేశం కల్పించబడింది. అనుమతించదగిన పరిమితులకు మించి అతనిని తరచుగా సందర్శించేవారని పేర్కొంది.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం పై దాడిని ప్రారంభించిన బిజెపి, జైన్ ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి స్పష్టంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మీడియా సమావేశం నిర్వహించింది. అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న మంత్రిని కేజ్రీవాల్ ఇంతవరకు బర్తరఫ్ చేయలేదని బీజేపీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా, ఎంపీ మనోజ్ తివారీ అన్నారు.

Exit mobile version