Site icon Prime9

Delhi Metro Users: ఇకపై ఢిల్లీ మెట్రో వినియోగదారులు రెండు సీల్ చేసిన ఆల్కహాల్ బాటిళ్లను తీసుకు వెళ్లవచ్చు.

Delhi Metro Users

Delhi Metro Users

 Delhi Metro Users: సవరించిన నిబంధనల ప్రకారం ప్రతి వ్యక్తికి రెండు సీలు చేసిన మద్యం బాటిళ్లను ఢిల్లీ మెట్రో లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని అధికారులు శుక్రవారంతెలిపారు. అయినప్పటికీ, మెట్రో ప్రాంగణంలో మద్యం సేవించడం పై ఇప్పటికీ నిషేధం ఉంది.

కమిటీ సమీక్ష తరువాత..( Delhi Metro Users)

ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ మినహా ఢిల్లీ మెట్రోలో ఇటీవలి వరకు మద్యం రవాణా నిషేధించబడిందని ఢిల్లీ మెట్రరోరైల్ ఒక ప్రకటనలో తెలిపింది.అయితే, తరువాత సీఐఎస్ఎఫ్ మరియు డీఎంఆర్సీ అధికారులతో కూడిన ఒక కమిటీ జాబితాను సమీక్షించింది. సవరించిన జాబితా ప్రకారం, ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని నిబంధనలకు సమానంగా ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తికి రెండు సీలు చేసిన మద్యం బాటిళ్లను తీసుకెళ్లడానికి అనుమతించబడిందని పేర్కొంది.

మెట్రో ప్రయాణికులు ఇతరులకు ఇబ్బందికలిగించకుండా, నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రయాణించాలని అధికారులు తెలిపారు. ఎవరైనా ప్రయాణీకులు మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తిస్తే, సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar