Kejriwal: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇంకా మలుపులు తిరుగుతోంది. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో ఆదివారం విచారణకు రావాలని పేర్కంది. సీబీఐ నోటీసులు జారీ చేయడంతో.. దేశ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
సీబీఐ నోటీసులు..
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇంకా మలుపులు తిరుగుతోంది. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో ఆదివారం విచారణకు రావాలని పేర్కంది. సీబీఐ నోటీసులు జారీ చేయడంతో.. దేశ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
దేశ రాజకీయాల్లో కీలక పరిమాణం చోటు చేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో భాగంగా.. దిల్లీ మద్యం విధానంపై ఆయన్ను సీబీఐ ప్రశ్నించనుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. నిందితుల రిమాండ్ రిపోర్టులో కేజ్రీవాల్ పేరు వచ్చినట్లు సమాచారం. దాని ఆధారంగానే.. సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇదివరకే ఈ కేసులో సంబంధం ఉన్న.. మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
దిల్లీ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయని.. 2022లో వినయ్‌కుమార్ హోంశాఖకు లేఖ రాశారు. అప్పటి నుంచి ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి లేఖరాయడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ1గా సిసోదియా పేరును చేర్చింది. సమాంతరంగా ఇదే కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ ఇప్పటి వరకు సమీర్ మహేంద్రు, విజయ్‌నాయర్, పి.శరత్‌చంద్రారెడ్డి, బినయ్‌బాబు, అభిషేక్ బోయిన్‌పల్లి, అమిత్ అరోడా, మాగుంట రాఘవరెడ్డిలను అరెస్ట్ చేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను కూడా ఇటీవల ఈడీ విచారించింది.