AAP MP Raghav Chadha: ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. చార్జిషీట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును పేర్కొన్న ఈడీ

ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా పేరును రెండవ అనుబంధ చార్జీషీటులో నమోదు చేసింది.

  • Written By:
  • Publish Date - May 2, 2023 / 02:57 PM IST

AAP MP Raghav Chadha: ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా పేరును రెండవ అనుబంధ చార్జీషీటులో నమోదు చేసింది. మనీష్‌ సిసోడియా మాజీ సెక్రటరీ సీ అరవింద్‌ ఈడీకి ఇచ్చిన సమాచారంలో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో జరిగిన సమావేశంలో చద్దా కూడా హాజరయ్యారని చెప్పడంతో ఈడీ చద్దా పేరును చార్జీ షీటులో జత చేసింది.

సమావేశానికి హాజరయ్యారనే..(AAP MP Raghav Chadha)

ఈ సమావేశానికి పంజాబ్‌ ఎక్సైజ్‌ కమీషనర్‌ వరుణ్‌ రూజామ్‌, విజయ్‌ నాయర్‌తో పాటు పంజాబ్‌ ఎక్సైజ్‌ డైరెక్టరేట్‌కు చెందిన పలువురు అధికారులు కూడా హాజరయ్యారని చెప్పారు సీ అరవింద్‌. ఇదిలా ఉండగా గత నెల 25వ తేదీన కేంద్ర దర్యాప్తు సంస్థ ( సీబీఐ) మొట్టమొదటిసారి అనుబంధ చార్జీషీటులో మనీష్‌ సిసోడియా పేరును జత చేసి ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు సమర్పించింది. కాగా సీబీఐ అనుబంధ చార్జీషీటులో హైదరాబాద్‌కు చెందిన సీఏ బుచ్చిబాబు గోరంట్ల, లిక్కర్‌ ట్రేడర్‌ అమన్‌దీప్‌ సింగ్‌ దల్లా, అర్జున్‌ పాండేల పేర్లను నమోదు చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 120-బీ (నేరపూరిత కుట్ర), 201, 420 సెక్షన్లతో పాటు ప్రివెన్షన్‌ ఆఫ్‌ ది కరెప్షన్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. నిందితుల పాత్రపై విచారణ జరుగుతోందని కోర్టుకు సీబీఐ తెలిపింది.

ఈ ఏడాది ఫిబ్రవరి సీబీఐ డిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్‌ నాయకుడు మనీష్‌ సిసోడియాను ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో కీలక పాత్ర పోషించారని అరెస్టు చేసింది. సిసోడియాను సెక్షన్‌ 120 బీ, 477ఏ కింద అరెస్టు చేసింది. ఇదిలా ఉండగా ఇదే కేసుకు సంబంధించి ఈడీ ఫైల్‌ చేసిన కేసుకు సంబంధించి గత శనివారం నాడు ఢిల్లీ కోర్టు సిసోడియాను మే 8 వరకు కస్టడీని పొడిగించింది. ఇలా ఉండగా ఈడీ చార్జిషీటులో తన పేరును చేర్చడంపై ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు.

అదంతా తప్పుడు ప్రచారం..

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఫిర్యాదులో నన్ను నిందితుడిగా పేర్కొన్నట్లు వార్తా కథనాలు, నివేదికలు వాస్తవంగా తప్పు.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఏ ఫిర్యాదులోనూ నన్ను నిందితుడిగా లేదా అనుమానితుడిగా పేర్కొనలేదు. ఆ ఫిర్యాదుల్లో నాపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఫిర్యాదులో నా పేరు ఏదో ఒక సమావేశానికి హాజరైనట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది, అయితే అలాంటి ఆరోపణ చేయడానికి ఆధారం స్పష్టంగా లేదు. నేను చెప్పిన సమావేశానికి సంబంధించి లేదా మరేదైనా ఆరోపించిన నేరాన్ని ఏ విధంగానైనా తీవ్రంగా మరియు నిస్సందేహంగా నిరాకరిస్తున్నాను. నేను మీడియా మరియు పబ్లికేషన్ హౌస్‌లను తప్పుగా నివేదించవద్దని మరియు ఈ సమస్యను స్పష్టం చేయవద్దని అభ్యర్థిస్తున్నాను. లేకపోతే నేను చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని చద్దా ఒక ప్రకటనలో పాల్గొన్నారు.