Delhi Rape: తన స్నేహితుడి 14 ఏళ్ల కుమార్తెపై నెలల తరబడి అత్యాచారం చేసి గర్భం దాల్చినందుకు ఢిల్లీలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రభుత్వ అధికారిపై ఆదివారం కేసు నమోదైంది. అతడినిఅరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రభుత్వ అధికారి నివాసానికి చేరుకున్నారు. బాధితురాలు ఢిల్లీలో 12వ తరగతి చదువుతోంది మరియు ఆమె తండ్రి అక్టోబర్ 1, 2020న మరణించిన తర్వాత నిందితుడి కుటుంబంతో నివసిస్తోంది.
సస్పెండ్ చేయాలని ఆదేశం..(Delhi Rape)
లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద అత్యాచారం ఆరోపణలపై నిందితుడు మరియు అతని భార్యపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. నిందితుడి భార్య బాధితురాలి గర్బస్రావానికి పిల్స్ ఇచ్చిందంటూ ఆరోపణలు వచ్చాయి. నవంబర్ 2020 మరియు జనవరి 2021 మధ్య బాలికపై పలు సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇలాఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సదరుప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.