Delhi Airport : దేశ రాజధాని ఢిల్లీతో సహా భారతదేశంలోని పలు ప్రాంతాల లో ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. 8 విమానాలు బయలుదేరడం ఆలస్యమైంది ఎయిర్ ఇండియా మెల్బోర్న్ కి వెళ్లే విమానం దాదాపు 2: 25 నిమిషాలు ఆలస్యమైంది 4:45 నిమిషాలకు రీ షెడ్యూల్ చేయబడిందని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. దుబాయ్ కి వెళ్లే విమానం 9 గంటల నుంచి 10:50 నిమిషాలకు రీ షెడ్యూల్ చేశారు జెడ్డా వెళ్ళే విమానం 10 గంటల 25 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట పది నిమిషాలకు టైం రీ షెడ్యూల్ చేశారు. దుబాయ్ కి వెళ్లే విమానం ఏడు గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 29 నిమిషాలకు మార్చారు.
పొగ మంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలా అన్ని ఫ్లైట్లను రీ షెడ్యూల్ చేసామని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. అప్ డేట్ చేసిన విమాన సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థను సంప్రదించవలసిందిగా అధికారులు సూచించారు. దట్టమైన పొగమంచు మరియు తక్కువ విజిబులిటీ కారణంగా చాలా రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి . పొగమంచు కారణంగా ఉత్తర రైల్వే ప్రాంతంలో రెండు రైళ్లు రీషెడ్యూల్ చేయబడ్డాయి.