The Aero India 2025 begins in Bengaluru: బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఎయిర్ షో 2025 ప్రారంభమైంది. ఈ ఎయిర్ షో వీక్షణకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. కాగా, ఫిబ్రవరి 14 వరకు ఆసియా టాప్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 15వ ఎడిషన్ కొనసాగనుంది.
భారత్‌లో మహాకుంభ్ జరుగుతోందని, ఏరో ఇండియా రూపంలో మరో మహాకుంభ్ ఇక్కడ మొదలైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే ప్రయాగ్‌రాజ్.. ఆత్మపరిశీలన కాగా, ఇక్కడ సృజనాత్మకత, పరిశీలన కోసమని చెప్పారు. ప్రయాగ్‌రాజ్.. అంతర్గత సమైక్యత, బెంగుళూరులో బాహ్యభద్రత కోసమన్నారు.
ఎయిర్ ఇండియా మహాకుంబ్‌లో భారత్ శక్తి కనిపిస్తుందన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ నినాదాన్ని గుర్తు చేశారు. వికాస్ భీ.. విరాసత్ భీ అనుగుణంగా ఉందని వివరించారు. గతంలో జరిగిన ఎయిర్ ఇండియా నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్ ఇండియాకు చాలా పురోగతి సాధించామన్నారు. అస్త్ర క్షిపణి, అండర్ వాటర్ అటానమస్ వెహికల్, న్యూజనరేషన్ ఆకాశ్ మిసైల్, అన్‌మ్యాన్డ్ సర్ఫేస్ వెస్సల్ వంటివి ఉన్నాయని, ఫ్యూచర్‌లో మరింత వేగంగా ముందుకెళ్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.