Site icon Prime9

DCGI: ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకుల్లో రక్తానికి ప్రాసెసింగ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలి.. డీసీజీఐ ఆదేశాలు

DCGI

DCGI

DCGI: డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) గురువారం బ్లడ్ యూనిట్లపై సరఫరా మరియు ప్రాసెసింగ్ ఖర్చులు మినహా అన్ని ఛార్జీలను నిషేధించింది. డీజీసీఐ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని డ్రగ్ కంట్రోలర్ కమ్ లైసెన్సింగ్ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక లేఖను పంపింది. రక్తం అమ్మకానికి లేదు అనే అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ప్రాసెసింగ్ ఛార్జీల రికవరీ కోసం సవరించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా అన్ని రక్త కేంద్రాలను ఆదేశించాలని డీజీసీఐ డ్రగ్ కంట్రోలర్ కమ్ లైసెన్సింగ్ అధికారులను కోరింది.ఒక వ్యక్తి రక్తదానం చేసినప్పుడు, అది నేరుగా రోగికి ఎక్కించబడదు. దానం చేయబడిన రక్తం దానిని ట్రాన్స్‌ఫ్యూజబుల్ భాగాలుగా వేరు చేయడానికి సెంట్రిఫ్యూజ్‌లలో ప్రాసెస్ చేయబడుతుంది. ఇందులో ఎర్ర కణాలు, ప్లేట్‌లెట్లు మరియు ప్లాస్మా ఉన్నాయి.దీనిని బ్లడ్ ప్రాసెసింగ్ అని పిలుస్తారు దీనికి ఖర్చు అవుతుంది.

రూల్స్ కు కట్టుబడి ఉండాలి.. (DCGI)

ఛార్జీలను ప్రామాణీకరించడానికి , దానిపై పరిమితిని విధించడానికి, ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు మొత్తం రక్తాన్ని ప్రాసెస్ చేయడానికి రూ. 1,550 కంటే ఎక్కువ వసూలు చేయరాదని పేర్కొంటూ కేంద్రం 2022లో మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్యాక్ చేసిన రెడ్ సెల్స్, ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా మరియు ప్లేట్‌లెట్ కాన్‌సెంట్రేట్ కోసం ప్రాసెసింగ్ ఛార్జీలు ఇవన్నీ రోగులలో రక్తమార్పిడి కోసం అవసరం. ప్రైవేట్ ల్యాబ్‌లకు వరుసగా రూ. 1,550, రూ. 400, రూ. 400కి పరిమితం చేయబడ్డాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రక్త కేంద్రాల్లో మొత్తం రక్తం, ప్యాక్ చేసిన ఎర్ర రక్త కణాలను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చు రూ.1100గా నిర్ణయించారు. సవరించిన మార్గదర్శకాలు రక్తం లేదా బ్లడ్ కాంపోనెంట్‌లకు మాత్రమే ప్రాసెసింగ్ రుసుము వసూలు చేయవచ్చని నిర్దేశిస్తుంది. రక్తం లేదా బ్లడ్ కాంపోనెంట్‌లకు ఇది రూ. 250 నుండి 1,550 మధ్య ఉంటుంది. డీజీసీఐ రాష్ట్రాలు మరియు కేంద్రప్రాలిత ప్రాంతాల డ్రగ్ కంట్రోలర్‌లు తమ పరిధిలోని అన్ని రక్త కేంద్రాలను సవరించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా ఆదేశించాలని కోరింది.ఒక యూనిట్ రక్తాన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రూ. 3,000 నుండి రూ. 8,000 వరకు ధర పలుకుతున్నాయి. రక్తం కొరత లేదా అరుదైన బ్లడ్ గ్రూపుల సందర్భాల్లో ఈ ఛార్జీలు ఎక్కువగా ఉండవచ్చు.

 

Exit mobile version