Karnataka : కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో కాఫీ ఎస్టేట్ యజమాని దాడితో షెడ్యూల్డ్ కులాలకు చెందిన గర్భిణీ స్త్రీ తన పుట్టబోయే బిడ్డను కోల్పోయిన సంఘటన జరిగింది.అక్టోబరు 8న చిక్కమగళూరు బాలెహోన్నూరు సమీపంలోని హుణసెహళ్లి పుర గ్రామంలోజగదీష్‌గౌడ్, ఆయన కుమారుడు తిలక్‌లు తమ వద్ద తీసుకున్న రూ.9 లక్షలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించడంలో జాప్యం చేసారంటూ పలువురు కార్మికులను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు.
కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో జగదీష్ గౌడ్ గర్భిణి అర్పిత కడుపుపై కొట్టి, ఆమెకు సహాయంగా వచ్చిన మరో ఇద్దరు మహిళలపై దాడి చేశాడు. ఆ తర్వాత కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా కడుపులో ఉన్న బిడ్డను కోల్పోయింది. గతంలో, అతను అర్పిత భర్తతో సహా కొంతమంది మగ కార్మికులపై కూడా దాడి చేశాడు.వీరిపై బాలెహోన్నూరు పోలీసులు షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, జగదీష్ గౌడ్ మరియు తిలక్ ఇద్దరూ ఇప్పటికీ పరారీలో ఉన్నారు. గౌడకు బిజెపితో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే జిల్లా పార్టీ యంత్రాంగం ఈ వాదనలను ఖండించింది .తండ్రీ కొడుకులిద్దరితో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
దీనిపై మానవ హక్కుల కార్యకర్త బృందా మాట్లాడుతూ తోట యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్బంధం, మానవ అక్రమ రవాణా మరియు బానిసత్వం. అతని రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. కాఫీతోటల్లోపనిచేసేవారిలో ఎక్కువమంది వలస కార్మికులే ఉంటారని వీరిలో చాలామంది తమపై దాడులు జరుగుతున్నా పోలీసులకు ఫిర్యాదు చేయరని అన్నారు.