Dahi Controversy: తమిళనాడులో అసలేంటీ ‘దహీ’ వివాదం?

ఇటీవల తమిళనాడు మిల్స్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( FSSAI)కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పె

Dahi Controversy: తమిళనాడులో భాషాపరమైన మరో వివాదం చెలరేగింది. రాష్ట్రంలో పెరుగు ప్యాకెట్లపై కర్డ్ అనే బదులు ‘దహీ’అని ముంద్రించాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( FSSAI)ఆదేశాలు జారీ చేయడమే తాజా వివాదానికి కారణం. అయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయంపై తమిళనాడు ముఖ్యమంత్రి తో పాటు పలువురు నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదరవుతున్నాయి.

 

ఏంటీ ‘దహీ’ వివాదం?(Dahi Controversy)

ఇటీవల తమిళనాడు మిల్స్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( FSSAI) కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్ల పై ఇంగ్లీష్ లో ఉన్న ‘కర్డ్’.. తమిళంలో ఉన్న ‘తయిర్’అనే పేర్లను తీసేసి ‘దహీ’అని మార్చాలని ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా పెరుగు మాత్రమే కాకుండా నెయ్యి, చీజ్ లాంటి డెయిరీ ఉత్పత్తుల పేర్లను కూడా మార్చాలని తెలిపింది. ఒక్క తమిళనాడుకే కాకుండా కర్ణాటక రాష్ట్రానికి కూడా ఇలాంటి ఆదేశాలు పంపినట్టు తెలుస్తోంది.

 

వారిని బహిష్కరిస్తాం: స్టాలిన్

అయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయంపై తమిళనాడులో తీవ్ర ఆగ్రహం రేగింది. తాజా నిర్ణయంపై పాల ఉత్పత్తి దారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం స్టాలిన్ కూడా ‘దహీ’ఉత్తర్వులపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దాలని కేంద్రం చూస్తోందని ధ్వజమెత్తారు. ఆఖరికి పెరుగు ప్యాకెట్లపై మా సొంత భాషను తొలగించి హిందీలో రాయమని చెబుతున్నారు. మాతృభాష పై ఇలాంటి నిర్లక్ష్యం పనికి రాదు. ఇలాంటి నిర్ణయాలకు కారణమైన వారిని దక్షిణాది శాశ్వతంగా బహిహ్కరిస్తుంది’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు.

దహీ పేరును వాడబోం(Dahi Controversy)

అదే విధంగా, తమిళనాడులో బీజేపీ చీఫ్‌ అన్నామలై కూడా దహీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలనే ప్రధాని మోదీ విధానాలకు ఈ నిర్ణయం విరుద్ధంగా ఉంది. ఈ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, ‘దహీ ’అనే పేరును వాడబోమని రాష్ట్ర పాల ఉత్పత్తి దారుల సమాఖ్య తేల్చి చెప్పింది.

 

నిర్ణయం వెనక్కి..

FSSAI నిర్ణయంతో విమర్శులు వెల్లువెత్తడంతో దహీ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. పేరు మార్పుపై తన ఆదేశాలను మార్చింది. పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లీష్ పేరుతో పాటు బ్రాకెట్లలో ప్రాంతీయ భాషల పేర్లను పెట్టుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది.