Site icon Prime9

Covid Cases: దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన కోవిడ్ కేసులు.. 38 మంది మృతి

124 cases find in foreigners with 11 variants who come to india

124 cases find in foreigners with 11 variants who come to india

Covid Cases: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గత వారం రోజులుగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజే.. 10,542 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారితో 38 మంది మృతి చెందారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో ఆందోళన మెుదలైంది. ఇప్పటినుంచే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

భారీగా పెరిగిన కేసులు.. (Covid Cases)

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గత వారం రోజులుగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్కరోజే.. 10,542 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారితో 38 మంది మృతి చెందారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో ఆందోళన మెుదలైంది. ఇప్పటినుంచే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

దేశప్రజల్లో మరోసారి ఆందోళన మెుదలవుతోంది. రోజురోజుకు కరోనా వైరస్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక్క రోజే.. తాజాగా 10, 542 కేసులు నమోదు అయ్యాయి. 38మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.

కరోనా ప్రభావంతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఇప్పుడిప్పడు ఊపీరి తీసుకుంటున్నారు. కానీ కరోనా మరోసారి ప్రతాపాన్ని చూపుతోంది.

నేను అంతరించిపోలేదు అన్నట్లుగా మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. మొదట్లో 1000 లోపు నమోదైన కేసులు..గణనీయంగా పెరుగుతూ భయపెడుతున్నాయి.

ఇటీవల 10 వేలు దాటుతూ రెండు మూడు రోజులు కేసులు పెరిగాయి. మధ్యలో కాస్త తగ్గిన తాజాగా మరోసారి 10వేలకు పైగా పెరుగుతు పోతున్నాయి.

తాజాగా 24 గంటల్లోనే 10,542 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీనితో ఇప్పటివరకు యాక్టీవ్ కేసుల సంఖ్య 63,562కు చేరింది.

కోవిడ్ మహమ్మారిని అరికట్టాలంటే ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం చేస్తే ఇది మరింతగా విస్తరించి పాతకథను రిపీట్ చేస్తుందనే భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,48,34,859)గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.14 శాతం ఉన్నాయి.

అలాగే రికవరీ రేటు 98.68 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తన తాజా కరోనా బులిటెన్‌లో వెల్లడించింది.

Exit mobile version