Prime9

Covid-19: అంతా భయం భయం.. కరోనా @ 4026

Corona Virus: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. కరోనా కొత్త వేరియంట్లు దేశంలో ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ముఖ్యంగా మే చివరి వారం నుంచి భారీగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశంలో కేరళ, మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా వ్యాప్తి చెందుతుండటం, మరోవైపు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా కేసులు వస్తున్నాయి.

 

కాగా తాజా సమచారం ప్రకారం సోమవారం రాత్రికి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలను దాటినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. 4026 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని, అలాగే గత 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతిచెందారని అధికారులు చెప్పారు. దేశంలో కరోనా ఉధృతంగా ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కానీ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అలాగే కరోనా వచ్చిన వారు జాగ్రత్తలు పాటిస్తూ, హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.

Exit mobile version
Skip to toolbar