Prime9

Corona Virus in India: కోరలు చాస్తున్న కోవిడ్.. దేశంలో 4 వేల కరోనా కేసులు!

Corona Virus Cases Increased in India: దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారంరోజులుగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4వేలకు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం 8 గంటలకు ఓ డేటా విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,961కు చేరిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

 

రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా కేరళలో 1,435 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 506 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఇక, ఢిల్లీలో 483 యాక్టివ్ కేసులు ఉండగా.. గుజరాత్‌లో 338 కేసులు, వెస్ట్ బెంగాల్‌లో 331 కేసులు, కర్ణాటక ప్రాంతంలో 253 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

ఇదిలా ఉండగా, దేశంలో కొత్త వేరియంట్ వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది. ఎన్‌బీ.1.8.1అనే కొత్త సబ్ వేరియంట్ ఉందని, దీనిపై మరింత అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. అయితే వైరస్‌కు సంబంధించిన లక్షణాలతో పాటు అంతకుముందు ఉన్న వేరియంట్లను పోలిస్తే ప్రభావం ఎంత మేర ఉండొచ్చనే తెలుస్తోందని వివరించింది. దీనికి సంబంధించిన నమూనాలు సేకరించి ఐఎన్‌ఎస్‌ఏసీఓజీకి పంపించినట్లు వెల్లడించింది. అయితే భారత్‌లో మాత్రం బీఏ.2, జేఎన్.1 వంటి వేరియంట్స్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 

Exit mobile version
Skip to toolbar