Site icon Prime9

Kejriwal vs Delhi LG: చల్ల బడండి లెప్టినెంట్ జీ, నా భార్య కూడా ఇన్ని ప్రేమ లేఖలు వ్రాయలేదు…

Cool down Lt ji, even my wife has never written so many love letters

Cool down Lt ji, even my wife has never written so many love letters

New Delhi: కేంద్ర ప్రభుత్వం ఆప్ ప్రభుత్వంపై పదే పదే కాలు దువ్వుతుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేపట్టిన ప్రతి పధకం, కార్యక్రమాలను నిత్యం ఆరోపించడం అలవాటుగా మారింది. ఢిల్లీ గవర్నర్ తో మాట్లాడిస్తున్న కేంద్రం మాటలకు, తాజాగా కేజ్రీవాల్ లెప్టినెంట్ జీకి ఓ ట్వీట్ ఇచ్చి చల్లబడిండి అంటూ కామెంట్ చేశాడు. అది కూడ ప్రేమలేఖలుగా సంబోధిస్తూ చేసిన ఆ ట్వీట్ కాస్తా నెట్టింట వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్లితే..

మీరు రాసినన్ని ప్రేమ లేఖలు నా భార్య కూడ నాకు రాయలేదు అంటూ అరవింద్ కేజ్రీవాల్ తన ట్వీట్ ను ప్రారంభించారు. లెఫ్టినెంట్ గవర్నర్ రోజూ తిడుతున్నన్ని తిట్లను నా భార్య కూడ తిట్టడం లేదు, కాస్త చల్లబడండి అంటూ పేర్కొన్నాడు. గడిచిన 6నెలల కాలంలో మీరు వ్రాసిన ప్రేమ లేఖలు, నా భార్య కూడా వ్రాయలేదంటూ మరో మారు చల్లబడండి, మీ సూపర్ బాస్ ను కూడా చల్లబడమని చెప్పండని ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఈ మద్య కాలంలో అనేక స్కాం, సదుపాయాల నిమిత్తం నిత్యం ఎల్ జీ వీకే సక్సేనా, సీఎం కేజ్రీవాల్ కు లేఖలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా గాంధీ జయంతినాడు రాజ్‌ఘాట్‌కు హాజరు కాకపోవడం గురించి ప్రశ్నించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చెట్లను తొలగించడానికి అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతుండటం గురించి ప్రశ్నించివున్నారు.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భిన్నమైన ట్వీట్ తో మరో మారు కేంద్ర తీరును ప్రజలు తెలుసుకొనేలా జర్క్ ఇచ్చారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంతో భాజపా పెద్దలు ఆప్ పార్టీపై చాలా గుర్రుగా ఉన్నారు. మరో వైపు డిసెంబర్ నెలలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నడంతో ఆప్ అధినేత పదే పదే భాజపా, కాంగ్రెస్ పార్టీలపై కాలు దువ్వుతూ ప్రజల్లో చొచ్చుకుపోతున్నారు. అదే క్రమంలో గుజరాత్ పర్యటనలో పలు కీలక అంశాలను ప్రజల ముందుకు తీసుకొస్తూ, తన పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో అంటూ అక్కడి ప్రజలకు కళ్లకు కట్టిన్నట్లు చూపిస్తున్నారు.

ఇది కూడా చదవండి:Arvind Kejriwal: పారిశుద్ధ కార్మికుడికి ఆప్ అధినేత విందు

Exit mobile version