Site icon Prime9

Adhir Ranjan Chaudhary: మణిపూర్ ఘర్షణలను పరిష్కరించకపోతే దేశానికి భద్రతా సమస్యలు..కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి

Adhir Ranjan Chaudhary

Adhir Ranjan Chaudhary

Adhir Ranjan Chaudhary: దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న మణిపూర్ జాతి సంఘర్షణను సత్వరమే పరిష్కరించకపోతే, అది దేశానికి భద్రతా సమస్యలను సృష్టించే అవకాశం ఉందని ప్రతిపక్ష ఇండియా కూటమి ఆదివారం చెప్పింది. ఇండియా కూటమికి చెందిన 21 మంది ఎంపీల బృందం ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శించిన తర్వాత మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉకేని రాజ్‌భవన్‌లో కలిసి తమ పరిశీలనలపై మెమొరాండం సమర్పించింది.

తెగల మధ్య అపనమ్మకాన్ని తొలగించేందుకు..(Adhir Ranjan Chaudhary)

సమావేశం అనంతరం రాజ్‌భవన్‌ వెలుపల విలేకరులతో మాట్లాడిన కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి గవర్నర్‌ మా అభిప్రాయాలను విని, వాటికి అంగీకరించారు. హింసపై ఆమె బాధను వ్యక్తం చేసి, ప్రజల బాధలను వివరించారు” అని అన్నారు. తెగల మధ్య అపనమ్మకాన్ని తొలగించేందుకు మైతేయి మరియు కుకీ ప్రజలతో మాట్లాడేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం మణిపూర్‌ను సందర్శించాలని గవర్నర్ సూచించారు. మేము కూడా ఆ సూచనకు అంగీకరిస్తున్నాము” అని చౌదరి చెప్పారు.పర్యటనకు వచ్చే ఎంపీలు మణిపూర్‌పై తమ పరిశీలనలను పార్లమెంట్‌లో ప్రదర్శిస్తారని, అవకాశం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు.మణిపూర్‌లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేసిన అవకతవకలపై పార్లమెంట్‌లో మాట్లాడుతామని, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రతిపక్షకూటమికి చెందిన ఎంపీలు వారి రెండు రోజుల పర్యటనలో మొదటి రోజు, వారు ఇంఫాల్, బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్ మరియు చురాచంద్‌పూర్‌లోని అనేక సహాయ శిబిరాలను సందర్శించారు మరియు జాతి ఘర్షణల బాధితులను కలుసుకున్నారు.అదిర్ రంజన్ చౌదరి, లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉపనేత గౌరవ్‌ గొగోయ్‌తో పాటు, ప్రతినిధి బృందంలో టిఎంసికి చెందిన సుస్మితా దేవ్, జెఎంఎం మహువా మాజి, డిఎంకెకు చెందిన కనిమొళి, ఆర్‌ఎల్‌డికి చెందిన జయంత్ చౌదరి, ఆర్‌జెడికి చెందిన మనోజ్ కుమార్ ఝా, ఆర్‌ఎస్‌పికి చెందిన ఎన్‌కె ప్రేమచంద్రన్, జెడి(యు) చీఫ్ రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్, అనీల్ ప్రసాద్ హెగ్డే (జెడి-యు), సిపిఐ నుండి పి సంతోష్ కుమార్ మరియు సిపిఐ(ఎం) నుండి ఎ ఎ రహీమ్ తదితరులు ఉన్నారు.

Exit mobile version