Delhi ordinance: ఢిల్లీలో అధికారుల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ ఆదివారం స్పష్టం చేసింది, ఇది సానుకూల పరిణామం’ అని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.
దీనిపై , కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ,వారు (ఆప్) రేపు సమావేశంలో చేరబోతున్నారని నేను భావిస్తున్నాను. ఆర్డినెన్స్ విషయానికొస్తే, మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది. మేము దానిని సమర్ధించబోము.దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసే లేదా గవర్నర్ల ద్వారా రాష్ట్ర విషయాలలో జోక్యం చేసుకునే ప్రయత్నాన్ని ఆమోదించడానికి కాంగ్రెస్ నిరాకరించిందని అన్నారు.
ఈ ప్రకటనపై ఆప్ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా స్పందిస్తూ ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ స్పష్టమైన వ్యతిరేకతను ప్రకటించింది. ఇది సానుకూల పరిణామం అని అన్నారు. కాంగ్రెస్ ప్రకటన తర్వాత, సోమవారం జరగనున్న విపక్షాల సమావేశంలో తాను పాల్గొంటున్నట్లు ఆప్ ప్రకటించింది.జూన్ 23న పాట్నాలో జరిగిన తొలి సమావేశంలో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు సమిష్టిగా ఐక్యంగా ప్రతిజ్ఞ చేశాయి.బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హాజరయ్యారు. అయితే, సమావేశ ముగింపు సందర్భంగా జరిగిన ఉమ్మడి విలేకరుల సమావేశానికి ఆప్ నేతలు గైర్హాజరు అయ్యారు.కాంగ్రెస్ ఢిల్లీ ఆర్డినెన్స్ ను ఖండించకపోతే దాని యొక్క 31 మంది రాజ్యసభ ఎంపీలు ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించేలా చేయకపోతే, భవిష్యత్తులో ఇతర సమావేశాలలో పాల్గొనబోమంటూ ఆప్ స్పష్టం చేసింది.
కేజ్రీవాల్ దేశవ్యాప్త ప్రచారంలో చురుకుగా నిమగ్నమై, వివిధ ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీల అధినేతలు, అలాగే తమిళనాడు, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు.ఇప్పటి వరకు, కేజ్రీవాల్ కాంగ్రెస్, TMC, DMK, శివసేన (ఉద్ధవ్), JDU, RJD, JMM, CPI, CPI(M), NCP, SP, TRS మరియు BRS వంటి పార్టీల నుండి ఆర్దినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు పొందారు.