Site icon Prime9

Congress questions: 9 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ 9 ప్రశ్నలు.. అవి ఏమిటో తెలుసా?

Congress questions

Congress questions

Congress questions:  మే 30తో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలోప్రధానికి 9 ప్రశ్నలు లేవనెత్తాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది.ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ మాట్లాడుతూ ఈ ప్రశ్నలపై ప్రధాని మౌనం వీడాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు.

మోదీ స్నేహితులకు ప్రభుత్వ ఆస్తులు..(Congress questions)

తొమ్మిది ప్రశ్నలు పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతుల ఆదాయం వంటి అంశాలపై ఆధారపడి ఉన్నాయి. ప్రధాని మోదీ హయాంలో జరిగిన నమ్మకద్రోహానికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.కాంగ్రెస్ శుక్రవారం 9 సంవత్సరాలు, 9 ప్రశ్నలు అనే పత్రాన్ని విడుదల చేసింది.ప్రధానికి ప్రశ్నలను సంధించిన జైరాం రమేష్, “భారత్‌లో ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం ఎందుకు విపరీతంగా పెరిగిపోతోంది? ధనికులు ఎందుకు ధనవంతులు మరియు పేదలు ఎందుకు పేదలుగా మారారు? ప్రధాని మోదీ స్నేహితులకు ప్రభుత్వ ఆస్తులను ఎందుకు అమ్ముతున్నారు? అసమానతలు పెరుగుతున్నాయా?మూడు “నల్ల” వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ రైతులతో చేసుకున్న ఒప్పందాలను ఎందుకు గౌరవించలేదని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధంగా ఎందుకు హామీ ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్లుగా రైతుల ఆదాయం ఎందుకు రెట్టింపు కాలేదని జైరాం రమేష్ ప్రశ్నించారు.

అవినీతిపై ఎందుకు మౌనం?..

ప్రధానమంత్రి ఎల్‌ఐసీ, ఎస్‌బీఐలో ప్రజల కష్టార్జిత పొదుపులను తన మిత్రుడు అదానీకి ఎందుకు పణంగా పెడుతున్నారు? దొంగలు ఎందుకు తప్పించుకుంటున్నారు? అని రమేష్ ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి పై ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు భారతీయులను ఎందుకు బాధపెడుతున్నారు? 2020లో చైనాకు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా వారు భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడం ఎందుకు?భారత భూభాగం పై వారి దూకుడు వ్యూహాలను ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎన్నికల ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వక “ద్వేషపూరిత రాజకీయాలు ఎందుకు ఉపయోగించబడుతున్నాయని ఆయన అడిగారు మహిళలు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనార్టీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. కుల గణన డిమాండ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదని జైరాం రమేష్ ప్రశ్నించారు.

ప్రతిపక్షాలపై ప్రతీకార రాజకీయాలు..

గత తొమ్మిదేళ్లలో మీరు మా రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సంస్థలను ఎందుకు నిర్వీర్యం చేశారు? ప్రతిపక్షాలు, నేతలపై ఎందుకు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు? . ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను అస్థిరపరిచడానికి ధనబలాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు? బడ్జెట్‌లో కోత విధిస్తూ, ఆంక్షలు విధిస్తూ పేదలు, నిరుపేదలు, గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు అని ప్రశ్నించారు.కోవిడ్-19 కారణంగా 40 లక్షల మందికి పైగా ప్రజలు మరణించినప్పటికీ, వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం ఎందుకు నిరాకరించింది? లక్షలాది మంది కార్మికులను ఇంటికి తిరిగి వచ్చేలా చేసి, ఎటువంటి మద్దతు ఇవ్వకుండా మీరు అకస్మాత్తుగా లాక్‌డౌన్ ఎందుకు విధించారు? అని కాంగ్రెస్ కోవిడ్ దుర్వినియోగంపై ప్రశ్నలను సంధించింది.

‘భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ ఈ 9 ప్రశ్నలను నిరంతరం లేవనెత్తారు, కానీ నేటికీ సమాధానం రాలేదు, ప్రధాని మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైంది అని జైరాం రమేష్ శుక్రవారం అన్నారు.

Exit mobile version