Gas cylinder price:19 కిలోల కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్ల ధరలు రూ. 171.50 తగ్గాయి. తగ్గిన ధరలు మే 1 నుంచి అమలులోకి వస్తయి సవరణ తరువాత, ఢిల్లీలో నేటి నుండి 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ రూ.1,856.50 ధరకు అందుబాటులో ఉంటుంది.
ప్రధాన నగరాల్లో సిలిండర్ ధరలు..(Gas cylinder price)
ముంబైలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,808.50 కాగా, కోల్‌కతాలో ధర రూ.1,960.50కి తగ్గింది. చెన్నైలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ను రూ.2,021.50కి విక్రయిస్తున్నారు. సవరణకు ముందు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ప్రకారం, 19 కిలోల LPG సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2,028, కోల్‌కతాలో రూ. 2,132, ముంబైలో రూ. 1,980 మరియు చెన్నైలో రూ. 2,192.50గా ఉన్నాయి.
ఏప్రిల్ 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.91.50 తగ్గింది. దీనితో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.2,028గా ఉంది.అంతకుముందు మార్చి 1న కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను రూ.350.50, డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.50 పెంచారు.