CM Jagan: ఏపీ సీఎం జగన్ మంగళవారం కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలైన గురజాపులంక, కూనాలంక, రామాలయం పేటలోని బాధితులను పరామర్శించారు. గురజాపులంకలోని మెడికల్ కాంపు వద్ద ఆగి పాముకాటుకు గురైన మహిళ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల పట్టాలను అడిగిన మహిళలకు తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
రైతులతో కలిసి మాట్లాడి సమస్యల గురించి ఆరా తీశారు. గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా రక్షణ చర్యలు తీసుకున్నామని..ప్రజల కోసం మెడికల్ క్యాంపులు నిర్వహిచామని అన్నారు. అధికారులందరినీ అప్రమత్తం చేశామని నిరంతరం కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసి పనుల్లో వేగం పెంచామని సీఎం తెలిపారు.కూనాలంక లో వరద ఫ్రభావిత ప్రాంతాలలో జగన్ పర్యటించారు.
వరద ప్రభావిత ప్రాంత ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. లంకాఫ్ ఠాణేలంక రామాలయం పేటలో ఉన్న వరద బాధితులను పరామర్శించారు. నేరుగా ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులు, తీసుకుంటున్న చర్యల గురించి జగన్ చర్చించారు.
వేగంగా, పారదర్శకంగా..( CM Jagan)
ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ వరద సాయం ప్రతీ ఇంటికి అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంటలకు నష్టం వాటిల్లితే రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయాలన్నారు. రెండురోజుల్లో ఆర్బీకేల్లో వరద బాధితుల జాబితా ఉంటుందని నెలలోపే వారికి నష్టపరిహారం అందుతుందని తెలిపారు. గతంలో మాదిరి పబ్లిసిటీకి పరిమితం కాకుండా వేగంగా పారదర్శకంగా తమ ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తోందని బాధితులను ఆదుకుంటోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏ ఒక్కరూ సాయం అందలేదని చెప్పకూడదన్నారు.