Site icon Prime9

Bangalore: బెంగళూరు విద్యార్దుల స్కూలు బ్యాగుల్లో సిగరెట్లు, కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, లైటర్లు, వైట్‌నర్‌

school bags

school bags

Bangalore: బెంగళూరులో విద్యార్థులు మొబైల్ ఫోన్లను తరగతి గదులకు తీసుకెళ్లడాన్ని అరికట్టేందుకు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు అందరినీ షాక్ కు గురిచేసాయి. 8, 9, 10 తరగతుల విద్యార్థుల బ్యాగుల్లో సెల్‌ఫోన్లు మాత్రమే కాకుండా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, లైటర్లు, సిగరెట్లు, వైట్‌నర్‌లను గుర్తించారు.

కర్ణాటకలోని ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్స్ (KAMS) పాఠశాలలు విద్యార్థుల బ్యాగులను తనిఖీ చేయాలని కోరింది. దీనితో నగరంలోని పలు పాఠశాలల్లో బ్యాగ్‌లను తనిఖీ చేసే మొత్తం కసరత్తు ప్రారంభమైంది. ఈ తనిఖీల్లో పైన చెప్పిన వస్తువులు బయటపడ్డాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు నివ్వెరపోయారు. పిల్లలలో ఆకస్మిక ప్రవర్తనా మార్పుల గురించి ఆందోళన చెందారు. అనంతరం పేరెంట్- టీచర్ సమావేశంలో పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version