Madras High Court: తమ విన్యాసాలతో తల్లి తండ్రులకు శోకం మిగిలుస్తున్నారు. నడిరోడ్డుపై వాహనచోదకులు భయభ్రాంతులకు గురైయ్యేలా ప్రవర్తిస్తున్నారు. నెట్టింట హల్ చేసిన అలాంటి ఓ వీడియో వైరల్ అయింది. చివరకు హైదరబాదుకు చెందిన ఆ యువకుడికి మద్రాసు హైకోర్టు వినూత్న శిక్షను విధించి విన్యాసాలు చేసేవారికి చెక్ పెట్టింది.
సమాచారం మేరకు, చెన్నైయ్ అన్నాశాల ప్రాంతంలో ఓ యువకుడు గత నెల 8న వాహనచోదకులను భయభ్రాంతులకు గురిచేస్తూ బైక్ రేసింగ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంబూరు ప్రాంతానికి చెందిన మహ్మద్ హ్యరీస్, సైఫాన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసింది. విచారణలో ఆ రోజు బైక్ రేసింగ్ చేసిన వ్యక్తి హైదరబాదుకు చెందిన కోట్ల అలెక్స్ గా గుర్తించారు. అతినికి ఇన్ స్టాగ్రాంలో 14వేల మంది ఫాలోవర్లు ఉన్నట్లు గుర్తించారు. బైకు నెంబరు ఆధారంగా అతడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. దీంతో కోట్ల అలెక్స్ ముందస్తు బెయిల్ ను కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ జరిగిన ధర్మాసనం వినూత్న శిక్షను విధిస్తూ తీర్పు నిచ్చింది.
మూడు వారాల పాటు ప్రతి సోమవారం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అవగాహన కల్పించేలా ప్రచారం చెయ్యాలని కోర్టు అలెక్స్ ను ఆదేశించింది. అదే విధంగా స్ఠానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వ వైద్యశాలలో వార్డు బాయ్ గా సేవలందించాలంటూ నిబంధనలతో కూడిన బెయిల్ ను అలెక్స్ కు ధర్మాసనం మంజూరు చేసింది.
దీంతో హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ సోమవారం ఉదయం అన్నాశాలైలోని తేనాంపేట సిగ్నల్ వద్ద రోడ్డు సేఫ్టీని పాటించాలంటూ కోట్ల అలెక్స్ బ్యానర్ పట్టుకొని అవగాహన ప్రచారం చేశాడు.
ఇప్పటికైనా ప్రజలు ప్రాణాలతోపాటు, తమ ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్న ఇలాంటి బైక్ రేసింగ్ లకు చెక్ పెట్టకపోతే విలువైన ప్రాణాలు పోగొట్టుకొంటారని గుర్తుంచుకోవాలి.
ఇది కూడా చదవండి:Election Commission: ఎన్నికల్లో వాగ్దానాల సాధ్యత గురించి ఓటర్లకు తెలియజేయాలి.. పార్టీలకు ఎన్నికల కమీషన్ లేఖ