Tamil Nadu: నకిలీ పత్రాలు, వ్యక్తులతో చేసిన మోసపూరిత రిజిష్ట్రేషన్లను రద్దు చేసే చట్టానికి తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళ్లితే, అలనాటి నటీమణీ వాణిశ్రీకి చెందిన ఇంటి స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారు. విషయం తెలుసుకొన్న తమిళనాడు సీఎం కబ్జా కోరల నుండి విడిపించి ఆ ఆస్తులను వాణిశ్రీ కి చెందేలా ఆయన చర్యలు తీసుకొన్నారు. ప్రస్తుతం ఆ ఆస్తి విలువ రూ. 20 కోట్లుగా మార్కెట్టులో ధర పలుకుతుంది. కబ్జా చేసిన భూమి పత్రాలను వాణిశ్రీకి సీఎం స్టాలిన్ స్వయంగా అందచేశారు. ఇందుకు ఆమె తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్నతలు తెలియచేసింది.
ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్ కొత్త చట్టానికి నాంది పలికారు. ఇక పై పరుల ఆస్తులను కాజేయాలని చూసిన వ్యక్తుల చెక్ పెడుతూ చట్టంలో పేర్కొన్న మేర వారి ఆస్తులు వారికే చెందనున్నాయి. తమిళనాడులో భూకబ్జాలు భారీగా జరుగుతుండడంతో స్టాలిన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సామాన్యులకు ఎంతో మేలు చేయనుంది.
ఇది కూడా చదవండి: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శనం టికెట్లు