Omar Abdullah: ఇండియా పేరును భారత్ గా మార్చుతారన్న వార్తల నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దమ్ముంటే రాజ్యాంగాన్ని మార్చండి అని సవాలు చేశారు. , దేశం పేరు మార్చడానికి రాజ్యాంగాన్ని మారిస్తే ఎవరూ కేంద్రానికి మద్దతు ఇవ్వరని అన్నారు.
పార్లమెంటులో పెట్టండి..(Omar Abdullah)
ప్రభుత్వం “ఇండియా” స్థానంలో “భారత్” అని దేశం పేరుగా పెట్టవచ్చనే ఊహాగానాలకు ప్రతిస్పందిస్తూ, ఇది సాధారణ విషయం కాదని అబ్దుల్లా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే దేశం పేరును ‘భారత్’గా మార్చే అంశాన్ని పార్లమెంట్‌కు తీసుకురావాలన్నారు.దాన్ని ఎవరూ మార్చలేరు.. పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ ఉందా.. ఉంటే మార్చుకోనివ్వండి అని అన్నారు. దేశం పేరు మార్చడం అంత ఈజీ కాదు.. ఇలా చేయాలంటే దేశ రాజ్యాంగాన్ని మార్చాలి.. దమ్ముంటే ఇలా చేయండి, ఎవరు సపోర్ట్ చేస్తారో కూడా చూస్తాం అని అబ్దుల్లా అన్నారు.ఇండియా మరియు భారత్ రెండూ రాజ్యాంగంలో వ్రాయబడ్డాయి. రాజ్యాంగం నుండి తొలగించలేమని ఆయన అన్నారు.ఇండియా అనబడే భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని రాజ్యాంగంలో వ్రాయబడింది. అందులో రెండు పేర్లూ ఉన్నాయి. ప్రజలు దీనిని భారతదేశం, లేదా భారత్ లేదా హిందుస్థాన్ అని పిలుస్తారు.. అది వారి హక్కు. మోదీ సాహిబ్ ఇండియా అనే పేరును ఉపయోగించకూడదనుకుంటే, ఆయన చేయవద్దు, కానీ అతను దానిని రాజ్యాంగం నుండి తొలగించలేడని అన్నారు.
రాష్ట్రపతి భవన్ G20 సదస్సు ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొన్న తర్వాత రాజకీయ పార్టీల్లో దీనిపై అలజడి ప్రారంభమయింది. ప్రభుత్వం దేశం పేరును మార్చబోతుందా అనే ఊహాగానాలకు దారితీసింది.ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసాయి సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్న 5 రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.