OTT Platform:కేంద్రప్రభుత్వం వచ్చే ఆగస్టు నాటికి వీటికి పోటీగా సొంత ఒటీటీ ఫ్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం దీని బాద్యతను పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌క్యాస్టర్ ప్రసారభారతికి అప్పగించింది. ప్రసార భారతి దేశీయ ఓటిటికి రంగం సిద్దం చేస్తోంది.
దేశీయ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌తో పాటు హాట్‌స్టార్‌కు పోటీ ఇవ్వబోతోంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రమోట్ చేస్తుంది. ఆగస్టులో అందుబాటులోకి వచ్చే ఓటీటీ ప్రారంభంలో ఒకటి, రెండు సంవత్సరాల పాటు ఉచితంగా ఇస్తుంది. దేశీయ ఓటిటి ప్లాట్‌ఫాం గురించి ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కుటుంబం మొత్తం కూర్చుని ఓటీటీ కార్యక్రమాలు ఆనందించే విధంగా ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఓటీటీలు మాత్రం అత్యంత జుగుప్సాకరంగా ఉండటమే కాకుండా అసభ్యకరమైన భాషతో ఉంటున్నాయి. కుటుంబం మొత్తం కలిసి చూసే పరిస్థితి లేదు. తమ ఓటీటీ మాత్రం డిసెంట్‌గా ఉండటంతో పాటు యావత్ కుటుంబం కలిసి ఆనందించే విధంగా ఉంటుందన్నారు. తమ ఓటిటి ప్లాట్‌ఫాం ప్రధానంగా ఇండియాను ఇండియా వ్యాల్యూస్‌ను ప్రమోట్ చేస్తుందన్నారు ప్రభుత్వ ఉన్నతాధికారి.
ఈ ఏడాది ఆగష్టు నాటికి..(OTT platform)
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల ఎజెండాలో భాగంగా స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫాంను తేవాలనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం దేశంలో ఎంటర్‌టెయిన్ మెంట్ మొత్తం కలుషితమైపోయింది. తమ ఆలోచన మాత్రం క్లీన్ ఎంటర్‌టెయిన్‌మెంట్‌తో పాటు సామాజిక, జాతీయ విలువలను ప్రోత్సహించే విధంగా ఉంటుందంటున్నారు. కేవలం వినోదంతో పాటు కరెంట్ ఎఫైర్స్ ప్రోగ్రాం ఉంటుంది. ప్రారంభంలో ఓటీటీ ఫ్లాట్‌ఫాం దేశ ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తుంది. అటు తర్వాత ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత చార్జీల గురించి ఆలోచిస్తామని చెబుతున్నారు.కాగా దేశీయ ఓటీటీని ప్రారంభంలో కొన్ని సంవత్సరాల పాటు ప్రసారభారతి నడుపుతుంది. ప్రస్తుతానికి ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశీయ ఓటీటీ ప్లాట్‌ఫాం అందుబాటులోకి వస్తుందని ప్రసారభారతి అధికారి ధీమా వ్యక్తం చేశారు.
కంటెట్ ప్రొవైడర్ల జాబితాకు ఆమోదం..
ఇక ఓటీటీకి కావాల్సిన కంటెట్ ప్రొవైడర్ల జాబితాను ప్రసార భారతి బోర్డు అమోదించింది. వారిలో శ్రీ అధికారి బ్రదర్స్‌ను అలాగే టెలివిజన్ కంటెంట్ ప్రొడక్షన్ రంగంలో బాగా అనుభవస్తులైన వారిని కూడా తీసుకుంది. ది కేరళ స్టోరీ నిర్మాత… దర్శకుడు విపుల్ షా, నటుడు కబీర్ బేడీతో పాటు పలువురిని ప్రసారభారతి బోర్డు సంప్రదించింది. అలాగే కంటెంట్ ప్రొవైడర్లతో ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి తమకు కావాల్సిన కంటెంట్ గురించి చర్చించారు. త్వరలోనే వారు కూడా కంటెంట్‌లతో కలిసి వస్తారు. కాగా కేంద్రప్రభుత్వం గతేడాది నుంచి ఓటీటీ ప్లాట్‌ఫాం ప్రారంభించాలని కసరత్తు చేస్తోంది. కాగా గత ఏడాది సెప్టంబర్‌లో ప్రసారభారతి ఓటీటీ స్ర్టీమింగ్ ఫ్లాట్‌పాం నడపడానికి డ్రాప్ట్ టెండర్‌ను ఆహ్వానించింది. ఇక టెండర్ విషయానికి వస్తే క్రియేషన్, డెవలెప్‌మెంట్ ఆపరేషన్, మెయిన్‌టెన్స్ గురించి టెండర్లు ఆహ్వానించింది. కాగా ఓటీటీ కార్యక్రమాలు దేశంలోని మారుమూల ప్రాంతాలతో పాటు గ్లోబల్ ఆడియెన్స్‌కు అందేలా ఉండాలనేది ప్రసార భారతి ఉద్దేశం.