Prime9

Central Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఓటరు రోలింగ్ నెంబర్ల విడుదలకు ఛాన్స్!

Central Election Commission Key Decisions about Rigging News: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ప్రతిపక్షాలు ఎన్నికలపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని కీలక నేతలు దేశంలోని పలు రాష్ట్రాల్లో రిగ్గింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం వెల్లడించింది. 2024లో దేశ వ్యాప్తంగా ఓటింగ్ విధానం పారదర్శకంగా జరిగిందనే ఉద్దేశంతో ఓ ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌లోని ఓటరు రోలింగ్ నంబర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఓటింగ్ శాతం పారదర్శకంగా వ్యవహరించనున్నట్లు కమిషన్ తెలిపింది.

 

Exit mobile version
Skip to toolbar