Site icon Prime9

DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కి సీబీఐ నోటీసులు

DK Shivakumar

DK Shivakumar

DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కి మళ్ళీ గడ్డుకాలం దాపురించింది. సీబీఐ మరోసారి డీకే శివకుమార్‌కి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో జరిగే విచారణకి ఈ నెల 11న హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. కేరళకు చెందిన జైహింద్‌ టీవీ ఛానల్‌లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని శివకుమార్‌, ఆయన భార్య ఉషతోపాటు 30 మందికి నోటీసులు జారీ అయ్యాయి.

పెద్ద కుట్ర..(DK Shivakumar)

జైహింద్‌ ఛానల్‌లో పెట్టుబడులు, వాటా వివరాలు చెప్పాలని సీబీఐ కోరింది. ఆయనకు 2013-18 మధ్యలో ఉన్న సంపాదనలో 74 కోట్లు లెక్కకు మించిన ఆదాయం ఉందని 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులు ఉండటంతోపాటుగా, దిల్లీలోని ఫ్లాట్లో 8 కోట్ల పైచిలుకు డబ్బు దొరికిన వ్యవహారంలో శివకుమార్‌ ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. అయితే తాను జైహింద్‌ ఛానల్‌లో రహస్యంగా పెట్టుబడులు పెట్టలేదని డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తనపై ఒత్తిడిని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తోందని ఆయన ఆరోపించారు.సిబిఐ నన్ను అరెస్టు చేయాలనుకుంటే నేను దానికి సిద్ధంగా ఉన్నాను వారు చేసుకోవచ్చని శివకుమార్ అన్నారు. నోటీసులు ఎలా జారీ చేస్తున్నారో తెలియదు. వారి వద్ద అన్ని పత్రాలు ఉన్నాయి. ఇది వారి వద్ద ఎటువంటి పత్రాలు లేనందున కాదు. నన్ను వేధించడానికి పెద్ద మనుషులున్నారు. నాకు అన్నీ తెలుసు. ఇది నాకు తెలియదని కాదు. నన్ను రాజకీయంగా అంతం చేయడానికి వారు ఏమైనా చేయనివ్వండని అన్నారు.పెద్ద కుట్ర జరుగుతోంది.. నన్ను జైలుకు పంపుతామని గతంలో కొందరు బీజేపీ నేతలు చెప్పారు.. తమ సందేశాన్ని సంబంధిత శాఖకు చేరవేశారు. పెద్ద పన్నాగం పన్నుతున్నారని శివకుమార్ అన్నారు.

డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు | CBI Notices To DK Sivakumar | Prime9 News

Exit mobile version
Skip to toolbar