Delhi Mohalla Clinics: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనా మొహల్లా క్లినిక్స్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సీబీఐ విచారణ జరిపించాలని హోమంత్రిత్వశాఖకు విచారణకు సిఫారసు చేశారు. దీంతో హోమంత్రిత్వశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది.డైరెక్టరేట్ ఆఫ్ ప్యామిలీ వెల్ఫేర్ మొహల్లా క్లినిక్స్ లో పెద్ద ఎత్తున అవకతకలు జరుగతున్నాయని ఓ నివేదికను ఎల్‌జీకి పంపించింది.
ఈ రిపోర్ట్‌ను ఎల్‌జీ హోంమంత్రిత్వశాఖకు పంపించారు. దీంతో ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ సామాన్య ప్రజలు, పేదలకు సేవలందించే మొహెల్లా క్లినిక్‌లపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక నివేదికలో ప్రస్తావించిన అంశాల విషయానికి వస్తే నకిలీ పేషంట్ల పేరుతో నాన్ మెడికల్ స్టాఫ్ ప్రిస్క్రైబ్ చేయడం డూప్లికేట్ దరఖాస్తుల్లో అసలు చలామణిలోని లేని మొబలై నంబర్లు నమోదు చేయడం లాంటివి విచారణలో వెలుగు చూశాయి. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ 2015లో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఈ క్లినిక్‌లను ప్రారంభించింది.
ఎల్-జీ కార్యాలయం నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే గత ఏడాది ఆగస్టు నుంచి మొహల్లా క్లినిక్స్ లో జరుగుతున్న అవకతకల గురించి నిఘా పెట్టామని చెప్పారు. రెండు రకాల మోసాలను గమనించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఏడు క్లినిక్స్ లో డాక్లర్లతో పాటు ఇతర వైద్య సిబ్బంది మోసాల పూరిత అటెండెన్స్‌లను నమోదు చేసినట్లు గుర్తించారు. ప్రీ రికార్డెడ్ వీడియోలు, నాన్ మెడికల్ స్టాప్ అసలు లేని రోగులకు టెస్ట్‌లను ప్రిస్క్రైబ్ చేసినట్లు విచారణలో తేలిందని ఎల్ జీ కార్యాలయం వర్గాలు తెలిపాయి. ఇక మోసాల విషయానికి వస్తే వేలాది కేసులు విషయానికి వస్తే పేషంట్లు టెస్టుల కోసం రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక టెస్టుల విషయానికి వస్తే రెండు ప్రైవేట్ ల్యాబ్‌లకు అప్పగించారు. ఇక కాంటాక్ట్ నంబరు కాలమ్ దగ్గర బ్లాంక్‌గా ఉంచడమో లేదా 9999999999, లేదా అన్నీ సున్నాలుగా రాశారు. వందాలాది రిజిస్ట్రేషన్ పామ్స్ లో అన్నీ డూప్లికేట్ నంబర్లే రాశారని ఎల్ జీ కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి.