Site icon Prime9

Karnataka Bandh: కావేరీ జలాల వివాదం.. నేడు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చిన కన్నడ సంఘాలు.

Karnataka Bandh

Karnataka Bandh

Karnataka Bandh: తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ అనుకూల సంఘాలు, రైతు సంఘాలు శుక్రవారం ‘కర్ణాటక బంద్’కు పిలుపునిచ్చాయి.  ఈ సందర్బంగా  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో  వివిధ సంస్థలకు చెందిన 70 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు.

44 విమానాలు రద్దు..(Karnataka Bandh)

బంద్ పిలుపు దృష్ట్యా ఈ రోజు అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు ఇతర విద్యా సంస్థలు మూసివేయబడ్డాయి. ప్రైవేట్  మరియు కార్పొరేట్ రంగాలలో పనిచేసే ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని భావిస్తున్నారు.ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు మరియు ఆటో రిక్షాలు “ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్ మరియు ఓలా ఉబెర్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ (OUDOA) బంద్‌కు మద్దతు ఇస్తున్నాయి. కర్ణాటకలోని షాపింగ్ మాల్స్ మరియు సినిమా థియేటర్లు బంద్‌కు మద్దతు ఇస్తున్నాయి . నిరసనల నేపధ్యంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 44 విమానాలు రద్దు చేయబడ్డాయి. ఆందోళనకారులు విమానాశ్రయానికి చేరుకుని నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు మరియు మాండ్యా జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలు మూసివేయబడ్డాయి. బెంగళూరులో సెక్షన్ 144 కింద ఆంక్షలు విధించబడ్డాయి.రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

అక్టోబరు 16 వరకు తమిళనాడుకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని వాటర్ ట్రిబ్యునల్ ఆదేశించడంతో కర్ణాటకలో మరోసారి కావేరీ నీటి సంక్షోభం తలెత్తింది.వేసవి అంతా బెంగళూరు నగర తాగునీటి అవసరాలు తీర్చడం కూడా మరో సవాలుగా మారనుంది. జూన్ 2024 వరకు రాష్ట్ర తాగునీటి అవసరాలు దాదాపు 33 టీఎంసీలు గా ఉన్నాయి. మరోవైపు 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తమిళనాడు డిమాండ్ చేసింది. 125 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఆగస్టు, సెప్టెంబర్‌లో తక్కువ వర్షాలు కురిశాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.

Exit mobile version