Site icon Prime9

Ghost video: దెయ్యం నడవడం వీడియోపై కేసు నమోదు

Case registered on ghost walking video

Case registered on ghost walking video

Varanasi: నేటి సమాజంలో సెల్ ఫోనే అరచేతిలో ప్రపంచంగా మారింది. ఆ మాటలు వినేందుకు బాగున్నా, అడప దడపా చోటుచేసుకొనే షాకింగ్ ఘటనలతో సమాజంలో అలజడి ప్రారంభమౌతుంది. అలాంటి భయానక దృశ్యాల నడుమ ఇంటి పై కప్పులపై దెయ్యం నడిచినట్లుగా వైరల్ అయిన వీడియోపై వారణాసి పోలీసులు కేసు నమోదు చేసి వాస్తవం తేల్చే పనిలో పడ్డారు.

వివరాల్లోకి వెళ్లితే, కొద్ది రోజుల క్రితం వారణాసి, బడి గబీ ప్రాంతంలోని వీడీఏ కాలనీలో తెల్లటి దుస్తులు ధరించిన ఓ ఆకారం ఇంటి పైకప్పులపై నడస్తూ ఉండడం సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమైంది. దీంతో అందరూ ఆ ఆకారాన్ని దెయ్యంగా పోలుస్తూ గందరగోళానికి తెరతీసారు. అనంతరం దీంతోపాటుగా మరో మూడు వీడియోలు కూడా దెయ్యం దుస్తుల్లో ఉంటూ సోషల్ మీడియాలో హల్ చేయడంతో, భయపడడం ప్రజల వంతైంది. కొంతమంది వీడియోలో ఉన్నది నిజమంటూ, మరి కొంతమంది ఫేక్ అంటూ ప్రచారం చేస్తూ దెయ్యం వ్యవహారానికి మరింత అజ్యం పోసారు. దీంతో స్థానికులు భేలుపూర్ పోలీసులను ఆశ్రయించి సమాజంలో జరుగుతన్న దెయ్యం వింత పై ఫిర్యాదు చేశారు.

గుర్తుతెలియని దుండగుల పనిగా భావిస్తూ భేలుపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఇన్‌స్పెక్టర్ రమాకాంత్ దూబే మాట్లాడుతూ వైరల్ అవుతున్న దెయ్యం వీడియోతో ప్రజలలో భయం నెలకొని వుందన్నారు. ఫిర్యాదు పై మేము గుర్తు తెలియని వ్యక్తుల పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఘటనగా భావిస్తున్న ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసిన్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, వారణాసి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు బయపడేలా ఎలాంటి దెయ్యాల ఘటనలేమీ జరగలేదని, ఇలాంటి వైరల్ వీడియోలను ఫార్వార్డ్ చేయవద్దని డిసిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమాయక ప్రజలు మాత్రం రాత్రి వేళల్లో ఇంటిపట్టునే ఉంటూ బతుకుజీవుడా అనుకొంటూ జాగారం చేస్తున్నారు. ఆకతాయిలు చేసిన పనా, లేదా ఇంకేదైనానా అన్న కోణంలో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు.


ఇది కూడా చదవండి:  పాదయాత్రను.. ఒళ్లు బలిసిన యాత్రగా పేర్కొన్న మంత్రి అంబటి

Exit mobile version